E-Paper
Advertisement

Ms Dhoni: గంభీర్ ను ఏకాకి చేసిన ధోని… ఇది కదా అసలు రివేంజ్.. ఈ వీడియో చూస్తే!

Ms Dhoni: గంభీర్ ను ఏకాకి చేసిన ధోని… ఇది కదా అసలు రివేంజ్.. ఈ వీడియో చూస్తే!
Advertisement

Ms Dhoni: సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రాంచీ వేదికగా {నవంబర్ 30} ఆదివారం టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో లండన్ లో నివసిస్తున్న విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం బుధవారం భారత్ కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టుతో కలిసి విరాట్ కోహ్లీ రాంచి వచ్చాడు.

Also Read: Smriti Mandhana Wedding: ప్చ్ సైలెన్స్… స్మృతి – పలాశ్ పెళ్లి జరుగుతుంది

Advertisement

అయితే తమ హోమ్ టౌన్ కి వచ్చిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లకు.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు. గురువారం రోజు రాత్రి తన ఇంట్లో ఈ డిన్నర్ ఏర్పాటు చేశాడు. కాగా విరాట్ కోహ్లీ.. మహేంద్రసింగ్ ధోని ఇంటికి రాబోతున్నాడు అని తెలిసిన అభిమానులు.. పెద్ద ఎత్తున ధోని ఇంటి వద్దకు చేరుకున్నారు. కోహ్లీ.. కోహ్లీ.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అభిమానులను పోలీసులు అదుపు చేసి.. విరాట్ కోహ్లీ, పంత్ ని ధోని ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఇక డిన్నర్ అనంతరం ధోని వీరిద్దరిని స్వయంగా హోటల్ గదిలో దిగబెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

గంభీర్ ఒంటరి అయ్యాడా..?

Advertisement

రాంచి వేదికగా టీమిండియా మ్యాచ్ లు జరిగిన ప్రతిసారి.. మహేంద్ర సింగ్ ధోని టీమ్ మొత్తానికి తన ఇంట్లో విందు ఇస్తూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం ధోని తన ఇంట్లో విందుకు విరాట్ కోహ్లీ, పంత్ లను మాత్రమే ఆహ్వానించాడు. ఈ క్రమంలో మహేంద్రసింగ్ ధోని.. గంభీర్ ని ఏకాకి చేశాడని, ధోని ఇచ్చిన దావత్ కి గంభీర్ ని పిలవలేదని సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్.. తరచూ మహేందర్ సింగ్ ధోని పై విమర్శలు చేసే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల భారత జట్టు వరుస పరాజయాలు చవి చూడడంతో.. గంభీర్ ని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించి మహేంద్రసింగ్ ధోనిని కోచ్ గా నియమించాలనే డిమాండ్స్ కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ధోని పథకం ప్రకారమే గంభీర్ ని ఆహ్వానించలేదని అంటున్నారు నెటిజెన్లు. కానీ నవంబర్ 30న తొలి వన్డే జరగనుంది. ఆలోపు ధోని జట్టు మొత్తాన్ని తన ఇంటికి ఆహ్వానించే అవకాశం ఉంది.

Also Read: Harsh Goenka: కోట్ల‌ల్లో న‌ష్టాలు… అమ్మకానికి రెండు IPL జట్లు

 

ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా:

తొలి వన్డే కోసం టీమిండియా ఇప్పటికే రాంచి చేరుకుంది. శుక్రవారం రోజు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అయితే ఇప్పటికే టెస్ట్, టి-20 క్రికెట్ కి వీడ్కోలు పలికిన రో – కో ద్వయం.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రో-కో ఈ వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించి.. సిరీస్ ని కైవసం చేసుకుని రివెంజ్ తీర్చుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సిరీస్ కి టీమిండియా కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో దూరమయ్యారు. దీంతో ఇప్పుడు ఈ సిరీస్ లో జట్టును కేఎల్ రాహుల్ ముందుండి నడిపించనున్నాడు.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×