E-Paper
Advertisement

Kavya Maran: నా డ‌బ్బు, నా ఇష్టం..ఎవ‌రినైనా కొనేస్తా?

Kavya Maran: నా డ‌బ్బు, నా ఇష్టం..ఎవ‌రినైనా కొనేస్తా?
Advertisement

Kavya Maran On Abrar Ahmed:  ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The 100 League 2026 Tournament) ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ కావ్య పాపపై (Kavya Maran) దేశద్రోహి ముద్ర వేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన సందర్భంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ( Pakistani spinner Abrar Ahmed)… కావ్యా కు సంబంధించిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు (Sunrisers Leeds) జెర్సీ వేసుకొని బరిలోకి దిగాడు. ఇండియాకు సంబంధించిన ఫ్రాంచైజీ తరఫున ఆడిన ఏకైక క్రికెటర్ గా అబ్రార్ అహ్మద్ చరిత్రలో నిలిచాడు. అయితే పాకిస్తాన్ వాళ్ళతో బంధాలు తెంచుకున్న ఇండియా… ఈ అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప ఆడించడం పై దుమారం రేగుతోంది. కావ్య పాపను దేశద్రోహి అంటూ ట్రోలింగ్ చేయడమే కాకుండా.. ఆమె పాకిస్తాన్ జెర్సీ వేసుకున్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి.. ధరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

నా డ‌బ్బు, నా ఇష్టం..ఎవ‌రినైనా కొనేస్తా? అంటూ కావ్య సంచ‌ల‌నం

Advertisement

ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నేపథ్యంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారంపై కావ్య పాపను మీడియా ప్రశ్నించింది. ప్రస్తుతం ఇంగ్లాండులోనే ఉన్న కావ్య పాపను ఉద్దేశించి… పాకిస్తాన్ ఆటగాడిని ఎందుకు కొనుగోలు చేశారని నిలదీశారు జర్నలిస్టులు. అయితే దీనిపై ఆమె నేరుగా సమాధానం ఇవ్వకుండా.. పరోక్షంగా జవాబు ఇచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్, సన్ రైజర్స్ లీడ్స్ జట్టులో ఉన్న సభ్యులతో తానైతే చాలా సంతృప్తిగా ఉన్నానని.. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు.

ఈ రెండు జట్లకు సంబంధించిన ప్లేయర్లను తాను ఏరి కోరి కొనుగోలు చేశానని.. ఆ ప్లేయర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందని వివరించారు. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారంపై మాత్రం కావ్య పాప (Kavya Maran) రియాక్ట్ కాలేదు. ఈ అంశాన్ని ఆమె లైట్ తీసుకున్నారు. కానీ స‌న్నిహితుల వ‌ద్ద మాత్రం డిఫ‌రెంట్ గా కావ్య మాట్లాడార‌ట‌. నా డ‌బ్బు, నా ఇష్టం..ఎవ‌రినైనా కొనేస్తా? అంటూ వీర్ర‌వీగార‌ని అంటున్నారు. పాకిస్తాన్ క్రికెట‌ర్లు వెధ‌వ‌లు అని, తెలిసే కొనుగోలు చేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించార‌ని ప్ర‌చారం సాగుతోంది. పాక్ ప్లేయ‌ర్ ను కొనుగోలు చేస్తేనే, ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ కు పేరు వ‌చ్చింద‌ని ఆమె తెలిపార‌ట‌. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

మొదటి మ్యాచ్ లోనే తేలిపోయిన అబ్రార్ అహ్మద్

Advertisement

ది హండ్రెడ్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఎమ్ఐ లండన్ వర్సెస్ సన్ రైజర్స్ లీడ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ తేలిపోయాడు. ఈ మ్యాచ్ లో తొలి బంతికే సిక్సర్ కొట్టిన అబ్రార్ అహ్మద్, బౌలింగ్ లో మాత్రం విఫలమయ్యాడు. చివరలో ఐదు బంతులు వేసి ఏకంగా మూడు సిక్సర్లు ఇచ్చాడు. మొత్తంగా 10 బంతులు వేసి 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు.

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

 

Related News

మ‌ళ్లీ తెర‌పైకి షేక్ హ్యాండ్ వివాదం…మా కాళ్ల ద‌గ్గ‌ర‌కు బీసీసీఐ వ‌చ్చిందంటూ ఓవరాక్ష‌న్

గొడ‌వ‌లు మ‌ర్చిపోయి, మాతో టెస్ట్ సిరీస్ ఆడండి..బీసీసీఐని కోరిన న‌ఖ్వీ

పాకిస్తాన్ క్రికెట్ లో వాస్తు దోషం..PCB ఆఫీస్ మార్చాలంటూ ఆదేశాలు

పొద్దున లేస్తే.. రాముడిని, మోదీని తిడ‌తారా? ఇవేం దిక్కుమాలిన నిర‌స‌న‌లు !

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

Big Stories

Advertisement
×