E-Paper
Advertisement

తెలంగాణ గ‌ల్లీలో విద్యార్థుల కోసం పోరాటం.. ఢిల్లీ గ‌ల్లీలో అరాచ‌క కాండ‌! బీజేపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

తెలంగాణ గ‌ల్లీలో విద్యార్థుల కోసం పోరాటం.. ఢిల్లీ గ‌ల్లీలో అరాచ‌క కాండ‌! బీజేపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!
Advertisement

బీజేపీ ఏం చేసినా అంతే.. అది దేశం కోసం.. ధ‌ర్మం కోస‌మే అనుకోవాలె. విద్యార్థులంతా బొట్టు పెట్టుకోవాల‌ని పిలుపునిచ్చినా.. మెడ‌ల్లోంచి బంగారం లాక్కెళ్లండ‌ని అని రెచ్చ‌గొట్టినా, స్కూటీల‌ను ఎత్తుకెళ్లండి అని ఉసిగొల్పినా.. బీజేపీ విధానాన్ని మ‌నం స‌మ‌ర్థించాలె. ఒక్కొక్క‌ప్పుడు ప‌ర‌స్ప‌ర భిన్న వైరుధ్యాలుగా ముందుకు సాగుతూ ఉంటుంది. డ‌బుల్ స్టాండ‌ర్ట్స్ మెయింటేన్ చేస్తూ ఉంటుంది. అయినా.. ఎక్క‌డి ప‌రిస్థితుల‌ను అక్క‌డే బేరీజు వేసుకుని.. అంతిమంగా అది బీజేపీ చేసిన దేశం, ధ‌ర్మం కోసం ..య‌జ్ఞంలో భాగ‌మ‌నుకోవాలి.

సేమ్ అట్ల‌నే ఉంది ఇప్పుడు తెలంగాణ‌, ఢిల్లీ బీజేపీ వ్య‌వ‌హారం చూస్తుంటే. ఢిల్లీలో జెన్‌-జీ చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను ఉక్కుపాదంతో తొక్కేస్తున్న‌ది ఢిల్లీ స‌ర్కార్‌. దేశం మొత్తం నివ్వెర‌పోయేలా చేసిన పాశవిక దాడిని కూడా స‌మ‌ర్థించుకునే క్ర‌మంలో వారిని ఉగ్ర‌వాదులుగా, అసాంఘీక శ‌క్తులు ఇచ్చిన ప్రోద్బ‌లంతో , నిధుల‌తో కొన‌సాగిస్తున్న ఆందోళ‌న‌గా చిత్రీక‌రించుకుంటున్నారే త‌ప్ప‌.. త‌మ త‌ప్పులు ఎర‌గ‌డం లేదు.

Advertisement

ఒక్క ప్ర‌ధాన్ కోసం ప్ర‌ధాని మొత్తం దిగ‌జారి ప్ర‌వ‌ర్తించార‌నే అప‌వాధును మూట‌గ‌ట్టుకున్నాడు. అయినా డోంట్ కేర్ అంటున్నాడు మోడీ. కానీ ఇక్క‌డ తెలంగాణ‌లో మాత్రం విద్యార్థుల‌కు ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ధ‌ర్నాకు దిగుతోంది టీ బీజేపీ. మొన్న‌టి దాకా లేని సోయి ఒక్క‌సారిగా వ‌చ్చిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఇక్క‌డి నేత‌లు.

నిజానికి ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ కు నిధులు కేటాయించ‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా ఇప్ప‌టికే ఛ‌లో సెక్ర‌టేరియ‌ట్ నిర్వ‌హించాయి. ఒక్క బీజేపీ మిన‌హా అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఫీజు రియంబ‌ర్స్‌మెంట్‌పై మాట్లాడుతున్నాయి. ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నాయి. కానీ ఇప్పుటికిప్పుడు టీ బీజేపీ ఈ అంశాన్ని నెత్తికెత్తుకున్న‌ది. అక్క‌డ ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళ‌న‌ను కాంగ్రెస్ హైజాక్ చేసింద‌నే కోపం కావొచ్చు.. మోడీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ జెన్‌-జీకి స‌పోర్ట్ చేస్తుంద‌నే అస‌హ‌నం కావొచ్చు.. మా బంగారు పుట్ట‌లో వేలు పెడితే మేం కుట్ట‌మా? అన్నట్టుగా మోడీ ని ర‌క్షించేందుకా అన్న‌ట్టుగా.. రేవంత్ స‌ర్కార్‌పై ఇలా క‌క్ష తీర్చుకుంటున్నాం.. అనే దోర‌ణిలో ఉన్న ప‌ళంగా తెలంగాణ‌లో ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ ఆందోళ‌న‌ల‌కు బీజేపీ పిలుపునిచ్చింది.

Advertisement

ఇప్పుడు ఇదే చ‌ర్చ‌కు తావిస్తోంది. అక్క‌డ విద్యార్థుల జీవితాల‌ను నాశ‌నం చేసిన నీట్‌లీకేజీ పై స్పందించ‌రు. బాధ్యుడైన మంత్రిని రాజీనామా చేయ‌మ‌ని విద్యార్థులు అందోళ‌న చేస్తే ప‌ట్టించుకోరు. పైగా వీపులు వాచిపోయేలా చిత‌క‌బాది .. వారికి ఉగ్ర‌వాదుల స‌పోర్టు ఉంద‌నే ప్ర‌చారం చేయ‌డానికీ బ‌రితెగిస్తారు…? ఇక్క‌డ మాత్రం అయ్యో విద్యార్థులు ఎంత బాధ‌ప‌డుతున్నారు.. వెంట‌నే ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ విడుద‌ల చేయాల‌ని గ‌గ్గోలు పెడ‌తారు.. ఇదీ బీజేపీ డబుల్ స్టాండ‌ర్డ్స్ అని విమ‌ర్శిస్తున్నారు విశ్లేష‌కులు.

Related News

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? రాడా? ఇది కాదు అసలు సమస్య..! ఏం చర్చిస్తున్నారు.. ఏం చట్టాలు చేస్తున్నారు? అనేదే ముఖ్యం..

శ్రీకాకుళం జిల్లా డీఎస్సీలో మరో బిగ్ స్కామ్ బట్టబయలు.. టాప్ మార్కులు వచ్చినా రాని టీచర్ ఉద్యోగం!

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

రెండేళ్లు చాన్సివ్వండి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది..ప‌రీక్ష‌లో మంచి మార్కులు తెచ్చుకుంటా! ఆ త‌రువాత మీ జీత‌భ‌త్యాలు నేను చూసుకుంటా!

Big Stories

Advertisement
×