E-Paper
Advertisement

SRH Captain: కావ్య పాప మ‌రో వివాద‌స్ప‌ద నిర్ణ‌యం..SRHకు కొత్త‌ కెప్టెన్ ను నియ‌మిస్తూ ప్ర‌క‌ట‌న‌!

SRH Captain: కావ్య పాప మ‌రో వివాద‌స్ప‌ద నిర్ణ‌యం..SRHకు కొత్త‌ కెప్టెన్ ను నియ‌మిస్తూ ప్ర‌క‌ట‌న‌!
Advertisement

SRH Captain:   సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ఓనర్ కావ్య పాప ( Kavya Maran) మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ను తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారట కావ్య మారన్. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం అభిషేక్ శర్మకు ( Abhishek Sharma) పగ్గాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు కావ్య పాపపై వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్‌ (Pat Cummins) ప్రారంభ మ్యాచ్ ల‌కు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. అతడు అసలు ఈ ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) ఆడేది కూడా డౌట్ అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా( SRH Captain) అభిషేక్ శర్మకు ఛాన్స్ ఇవ్వాలని కావ్య పాప నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. దీంతో కావ్య పాప నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది.

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

కావ్య పాప మ‌రో వివాద‌స్ప‌ద నిర్ణ‌యం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో రెండు వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుత సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మొన్న టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కూడా ఆడలేదు ప్యాట్ కమిన్స్. ఇక అతను కోలుకోవాలంటే మరో 15 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. అంటే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ల‌కు ప్యాట్ కమిన్స్ దూరమవుతాడని లెక్క. అదే జరిగితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్ ఓనర్ కావ్య పాప కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు.

అన్ని ఓకే అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వాడే మొదటి ద‌శ మ్యాచ్ లకు అభిషేక్ శర్మ కెప్టెన్ గా ఉంటాడన్నమాట. ఇన్ని రోజులు దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ ఇప్పుడు కెప్టెన్ అయితే.. అదే దూకుడు ప్రదర్శిస్తాడా ? లేక ఒత్తిడికి లోనై కాస్త మెల్లగా ఆడతాడా? అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అయితే టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో అభిషేక్ శర్మ ఆడింది పెద్దగా ఏమీ లేదు. చెత్త ఫామ్ కనబరిచాడు. మూడుసార్లు డక్ ఔట్ అయ్యాడు. ఇలాంటి వెధ‌వకు కెప్టెన్సీ ఇప్పుడు ఇవ్వడం శుద్ధ దండగా అంటూ మళ్లీ కావ్య పాపను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకు కావ్య పాపపై దేశద్రోహి ముద్రవేశారు ఇండియన్ ఫ్యాన్స్. ఇప్పుడు అభిషేక్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల కూడా విమర్శలు చేస్తున్నారు.

ఐపీఎల్ 2026 ప్రారంభం ఎప్పుడంటే ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. మార్చి 28వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ షురూ అవుతుంది. ఈ మేరకు తొలిదశ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది బీసీసీఐ. మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మొదటి దశ టోర్నమెంట్ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తిస్థాయిలో షెడ్యూల్ కూడా రానుంది. కేరళం, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎండాకాలంలో జరగనున్నాయి. అందుకే ఈ ఐపిఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ రిలీజ్ చేయలేదు బిసిసిఐ. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ తో రానుంది.

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×