E-Paper
Advertisement

niharika konidela:పిల్లల్ని కనాలని ఉంది..పెళ్లి చేసుకుంటాను.. క్లారిటీ ఇచ్చేసిన నిహారిక..

niharika konidela:పిల్లల్ని కనాలని ఉంది..పెళ్లి చేసుకుంటాను.. క్లారిటీ ఇచ్చేసిన నిహారిక..
Advertisement

niharika konidela:మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. మెగా బ్రదర్ నాగేంద్రబాబు కుమార్తెగా సినీ వాతావరణంలో పెరిగిన నిహారిక మొదట టెలివిజన్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తూ తన మాటతీరు, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

తర్వాత నటనపై ఆసక్తి పెరగడంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కొన్ని తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించిన నిహారిక, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. భారీ హిట్లు లేకపోయినా, ఆమెకు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ మాత్రం ఏర్పడింది.

Advertisement

వ్యక్తిగత జీవితంలో నిహారిక బిజినెస్ స్ట్రాటజిస్ట్ జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి అప్పట్లో సోషల్ మీడియాలో కూడా చాలా చర్చకు దారి తీసింది. అయితే పెళ్లి తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవల ఒక పాత ఇంటర్వ్యూలో నిహారిక తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్‌గా మాట్లాడిన మాటలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రెండో పెళ్లి గురించి ఆమె చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Advertisement

ఆ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ, “నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు కావాలంటే పెళ్లి తప్పనిసరి. ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ కాలేదంటే దానికి ఒక్క కారణం ఉండదు. చాలా కారణాలు ఉంటాయి. అలాంటి కారణాల వల్లే నా పెళ్లి కూడా నిలవలేదు” అని తెలిపింది.

ప్రేమ గురించి మాట్లాడుతూ కూడా ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. “ఒక బంధం పనిచేయలేదని ఇక జీవితంలో మళ్లీ ప్రేమ పుట్టదని అనుకోవడం మూర్ఖత్వమే. త్వరలోనే అని చెప్పలేను కానీ సరైన సమయం వచ్చినప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటాను” అని చెప్పింది.

ఇక లవ్ మ్యారేజ్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా ఆమె సమాధానం ఇచ్చింది. “ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో వారికి నచ్చకుండా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను. ప్రస్తుతం నా కెరీర్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. పెళ్లి విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం లేదు” అని వెల్లడించింది.

కుటుంబం గురించి మాట్లాడుతూ నిహారిక తన తండ్రి నాగేంద్రబాబుతో తనకు ఎక్కువ అనుబంధం ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది. వెబ్ సిరీస్‌లు, డిజిటల్ కంటెంట్ నిర్మాణంలో కూడా నిహారిక ఆసక్తి చూపుతోంది.

ALSO READ: Priyanka Chopra: ఆస్కార్ అవార్డు వేడుకలో మెరిసిన ప్రియాంక చోప్రా.. ధరించిన నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా?

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×