E-Paper
Advertisement

Kavya Maran: కావ్య పాపలో ఉరకలెత్తిన ఆనందం..

Kavya Maran: కావ్య పాపలో ఉరకలెత్తిన ఆనందం..
Advertisement
Kavya Maran’s Celebration After Sunrisers Beat CSK In IPL 2024 Match: ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్  6 వికెట్ల తేడాతో ధోనీ సేన సీఎస్కేపై విజయం సాధించింది. దీంతో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ స్టేడియంలో ఆనందంతో గెంతులేశారు. నిజానికి కావ్య మారన్ ఎవరో కాదు సన్ గ్రూప్ సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె. అంతేకాదు డీఎంకే అధినేత దివంగత కరుణానిధి ముని మనవరాలు.
ఎంతో పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి కూడా కావ్య మారన్ ఎంతో సింపుల్ గా కనిపిస్తుంది. అంతేకాదు వేల కోట రూపాయల సామ్రాజ్యానికి తను ఒక్కరే వారసురాలు కావడం విశేషం. అలాంటి కావ్య పాప హైదరాబాద్ వచ్చి మ్యాచ్ చూస్తూ, ఎంజాయ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఆమెను ఎంకరేజ్ చేశారు. అంతేకాదు సన్ రైజర్స్ సిక్స్ కొట్టినా, ఫోర్ కొట్టినా ముందు కావ్య పాప ఎక్సైట్ మెంట్ నే కెమెరామెన్ మాటిమాటికి చూపించాడు. దీంతో నెటిజన్ల ఫోకస్ అంతా అటువైపునకే వెళ్లింది.

 

Also Read: విరాట్ విజయమా.. పరాజయమా? నేడు బెంగళూరు వర్సెస్ రాజస్థాన్

Advertisement

మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అదీ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుపై గెలవడంతో అందరిలో ఆనందం రెట్టింపు అయ్యింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి టార్గెట్ పూర్తి చేసి విజయం సాధించింది.

ఇప్పటికి రెండు మ్యాచ్ లు నెగ్గి, రెండింట ఓటమి పాలైన సన్ రైజర్స్, ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. చెన్నయ్ మాత్రం అధిక రన్ రేట్ కారణంగా మూడోస్థానంలో నిలిచింది.

Advertisement

అత్యధిక ధరపెట్టి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ని సన్ రైజర్స్ తెచ్చుకుంది. నడిపించేవాడు సరైనవాడైతే ఆ జట్టుకి తిరుగుండదని సన్ రైజర్స్ జట్టు నిరూపిస్తోంది. ఇలాగే వ్యూహాత్మకంగా ముందుకెళితే రేస్ లో నిలవడం ఖాయమని అంటున్నారు.

Tags

Related News

కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

Big Stories

Advertisement
×