BigTV English

RR vs RCB IPL 2024 Preview: విరాట్ విజయమా.. పరాజయమా? నేడు బెంగళూరు వర్సెస్ రాజస్థాన్

RR vs RCB IPL 2024 Preview: విరాట్ విజయమా.. పరాజయమా? నేడు బెంగళూరు వర్సెస్ రాజస్థాన్

RR vs RCB today match dream 11 predictionRR vs RCB today match dream 11 prediction(Cricket news today telugu): ఐపీఎల్ ప్రారంభమై ఇప్పటికి 18 మ్యాచ్ లు గడిచిపోయాయి. దాదాపు అన్ని జట్ల పెర్ ఫార్మెన్స్ పై అందరూ ఒక అంచనాకి వచ్చేశారు. ఎవరు రేస్ లో ఉంటారు, ఎవరు ఉండరనే దానిపై ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఈరోజు ఆర్సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య జైపూర్ లో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.


ఇప్పుడు ఆర్సీబీపై ఆల్రడీ అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఈసారి కూడా కప్ కొట్టలేదని తేల్చేస్తున్నారు. చాలామంది సీనియర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే ఆర్సీబీ అప్పుడే 4 మ్యాచ్ లు ఆడింది. మూడు ఓడి, ఒకటి గెలిచి, పాయింట్ల టేబుల్ లో 7వ స్థానంలో నిలిచింది.

ఆర్సీబీతో పోటీ పడే రాజస్తాన్ రాయల్స్ మూడుకి మూడింట గెలిచి టేబుల్ లో రెండో స్థానంలో ఉంది. ఇంతవరకు వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్ లు జరిగాయి. ఆర్సీబీ 15 మ్యాచ్ లు గెలిస్తే, ఆర్ఆర్ 12 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల్లో ఫలితం రాలేదు. ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే 2020 నుండి చూస్తే ఈ రెండు జట్ల మధ్య 9 మ్యాచ్ లు జరిగాయి. రాజస్థాన్ కేవలం ఒక్క మ్యాచ్ లోని గెలిచింది.


Also Read: హైదరాబాద్ వీరబాదుడు.. తేలిపోయిన చెన్నై బౌలర్లు..!

కానీ 2024లో రెండు జట్ల ఫామ్ చూస్తే, రాజస్థాన్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే కెప్టెన్ సంజు శాంసన్ జట్టుని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. విజయాలు దక్కుతుంటే ఆటోమేటిక్ గా కెప్టెన్ పై గౌరవం కూడా పెరుగుతుంది. యశస్వి ఇంకా ఫామ్ లోకి రాలేదు. షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ రాణిస్తున్నారు. బౌలింగ్ లో చాహల్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, కుల్దీప్ వంటి బౌలర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే ఆంశం.

బెంగళూరు విషయానికి వస్తే విరాట్ కొహ్లీ, దినేష్ కార్తీక్ ఇద్దరిపైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ డుప్లెసిన్ ఇంకా తన స్థాయికి తగిన ఆట చూపించలేదు. బౌలర్లు కూడా ప్రారంభ ఓవర్లలో ధారాళంగా పరుగులిస్తున్నారు. ముఖ్యంగా సిరాజ్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. వికెట్లు తీయకపోయినా పర్వాలేదు. పరుగులైనా కంట్రోల్ చేయాలి కదా…అని క్రీడా విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.

ఆర్సీబీ ప్లేయింగ్  XI:డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

రాజస్థాన్ ఫ్లేయింగ్ XI:సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, , రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, నాంద్రే బర్గర్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×