BigTV English

March 2024 Two-Wheeler Sales: గత నెలలో వాహన ప్రియుల మనసుదోచేసిన బైక్ బ్రాండ్స్ ఇవే..!

March 2024 Two-Wheeler Sales: గత నెలలో వాహన ప్రియుల మనసుదోచేసిన బైక్ బ్రాండ్స్ ఇవే..!
Two Wheeler Sales March 2024
Two Wheeler Sales March 2024

March 2024 Two-Wheeler Sales: ప్రస్తుతం టూ వీలర్లు నడిపేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందువల్లనే టూ వీలర్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి నెలలోనూ టూ వీలర్స్ అమ్మకాలు ఘణనీయంగా పెరుగుతున్నాయి. దీనిబట్టి చూస్తే బైక్‌ ప్రియులు చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పుడు గత నెలలో బైక్స్ సేల్స్ ఏ రేంజ్‌లో జరిగాయి.. టాప్-6 మోటార్‌సైకిల్ బ్రాండ్స్ ఏవి అనే విషయాల్ని తెలుసుకుందాం. మార్చి 2024 ముగియడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను రిలీజ్ చేశాయి.

గత నెల టాప్ 6 బైక్‌ల బ్రాండ్స్ సేల్స్ 12,26,262 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే ఈ అమ్మకాలు 2023 మార్చి కంటే 15.24 శాతం ఎక్కువగా నమోదైంది. అందులో మొదటి స్థానంలో ఏ కంపెనీ ఉంది. చివరిస్థానంలో ఏ బ్రాండ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


హీరో మోటోకార్ప్:

Also Read: ఈ నెలలో లాంచ్ కానున్న సూపర్ బైక్స్..!

భారతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్, ప్రజాదరణ పొందిన బైక్‌లలో టూ వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఒకటి. ఈ ఏడాది మార్చి నెలలో ఈ కంపెనీ ఏకంగా 4,59,257 యూనిట్ల వాహనాలను విక్రయించి అబ్బురపరచింది. దీంతో టాప్ 6 జాబితాలో మొదటి స్థానం సంపాదించుకుంది. కాగా మొత్తం అమ్మకాల్లో హీరో మోటోకార్ప్ వాటా 32.50 శాతం పొందింది. అయితే గత ఏడాది 2023 మార్చి నెలలో కంపెనీ సేల్స్ 502730 యూనిట్లుగా ఉన్నాయి. అంటే ఒకరకంగా చూస్తే.. మార్చి 2024 అమ్మకాలు 8.65 శాతం తక్కువని స్పష్టమవుతోంది.

హోండా మోటార్‌సైకిల్:

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత నెల అంటే ఈ మార్చిలో మొత్తం 358151 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి అదరగొట్టేసింది. దీంతో ఇది అమ్మకాల పరంగా చూసుకుంటే రెండో స్థానంలో ఉంది. కాగా 2023 మార్చిలో 197512 యూనిట్లను విక్రయించినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. దీని బట్టి చూస్తే గత ఏడాది 2023 మార్చి కంటే 2024 మార్చి అమ్మకాలు 81.33 శాతం ఎక్కువని తెలుస్తోంది. దీంతో దీని మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 25.34 శాతంగా పొందింది.

బజాజ్ ఆటో:

ప్రముఖ టూ వీలర్ కంపెనీ బజాజ్ ఆటో ఎప్పటికప్పుడు కొత్త బైకులు, స్కూటర్లపే మార్కెట్‌లో లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. అయితే గత మార్చి నెల ఈ కంపెనీ అమ్మకాలు మొత్తం 1,83,004 యూనిట్లు.కాగా మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 12.95 శాతంగా ఉంది. అయితే గతేడాది 2023 మార్చి నెల కంపెనీ సేల్స్ 1,52,287 యూనిట్లు. దీనిబట్టి చూస్తే.. 2023 మార్చి కంటే 2024 మార్చి నెలలో 20.17 శాతం సేల్స్ ఎక్కువగా నమోదు అయ్యాయి. దీంతో ఇది నాల్గవ స్థానాన్ని కలిగి ఉంది.

Also Read:  ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు..!

సుజుకి మోటార్‌సైకిల్:

వీటి తర్వాత ఐదో స్థానంలో సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ గత మార్చి నెలలో 89164 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక 2023 మార్చి నెలలో కేవలం 73069 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. దీన్ని ప్రకారం.. కంపెనీ అమ్మకాలు 2023 కంటే 2024 మార్చిలో ఏకంగా 17.92 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అర్థం అవుతోంది. 2024 మార్చి మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 6.10 శాతంగా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్:

వాహన ప్రియులకు టూ వీలర్స్‌లో ఏ బైక్‌ లుక్ బాగుంటుందని అడిగితే రాయల్ ఎన్‌ఫీల్డ్ అనే చెప్తారు. అంతటి క్రేజ్ ఉందిమరి ఈ బైక్‌లకు. ఈ కంపెనీ ఈ ఏడాది గత మార్చి నెలలో 66,044 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీంతో మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 4.67 శాతంగా ఉంది. అయితే గతేడాది ఇదే మార్చి నెల కంపెనీ అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిబట్టి చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా అత్యధిక అమ్మకాలు పొందిన కంపెనీల జాబితాలో చేరిందనే చెప్పాలి.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×