E-Paper
Advertisement

KKR-Mustafizur: ముస్త‌ఫిజుర్ స్థానంలో ఈ 6 గురు అన్ సోల్డ్‌ ప్లేయ‌ర్లు రెడీ..కేకేఆర్ కు నో టెన్ష‌న్ ?

KKR-Mustafizur: ముస్త‌ఫిజుర్ స్థానంలో ఈ 6 గురు అన్ సోల్డ్‌ ప్లేయ‌ర్లు రెడీ..కేకేఆర్ కు నో టెన్ష‌న్ ?
Advertisement

KKR-Mustafizur: బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ పై ( Mustafizur Rahman) భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) వేటు వేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఆడకుండా ముస్తాఫిజుర్ రహమాన్ పై వేటు వేసింది బీసీసీఐ పాలక మండలి. ఇలాంటి నేపథ్యంలో కేకేఆర్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. రూ.9.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకపోతే, కేకేఆర్ ( KKR) గెలవడం చాలా కష్టమవుతుంది. అయితే బీసీసీఐ నిర్ణయం ప్రకారం అందరూ నడుచుకోవాల్సిందే. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman) స్థానంలో కొత్త ప్లేయర్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది కేకేఆర్ యాజమాన్యం. ఈ నేపథ్యంలో ఏకంగా తెరపైకి ఆరుగురు ప్లేయర్లు వచ్చారు.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో ఆరుగురు ప్లేయర్లు రెడీ

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ముస్తాఫిజుర్ రహమాన్ కు ( KKR-Mustafizur) స్థానం లేకపోవడంతో అతని స్థానంలో కేకేఆర్ జట్టులోకి మరో ప్లేయర్ రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman) స్థానంలో ఆరుగురు ప్లేయర్లు రెడీగా ఉన్నారు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిన వాళ్లపై కన్నేసింది కేకేఆర్ యాజమాన్యం. ముందుగా సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు జెరాల్డ్ కోయెట్జీ ( Gerald Coetzee ) ను ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో తీసుకోవాలని కేకేఆర్ నిర్ణయం తీసుకుందట. మొన్నటి ఐపీఎల్ మినీ వేలంలో ఇతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు. గతంలో ముంబై ఇండియన్స్ అలాగే గుజరాత్ టైటాన్స్ కు ఆడిన అనుభవం జెరాల్డ్ కోయెట్జీ ( Gerald Coetzee )కు ఉంది. ఈ నేపథ్యంలోనే జెరాల్డ్ కోయెట్జీకు అవకాశం ఇచ్చేందుకు కేకేఆర్ సిద్ధమైందట.

అన్ సోల్డ్‌ ప్లేయ‌ర్లపైనే క‌న్ను

ఒకవేళ ఈ సౌత్ ఆఫ్రికా ఆటగాడు అందుబాటులోకి రాకపోతే ఫజల్హాక్ ఫారూఖీ ( Fazalhaq Farooqi ) అనే ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ పై కూడా కన్నేసింది కేకేఆర్. ముస్తాఫిజుర్ రహమాన్ ( Bangladesh Mustafizur Rahman) స్థానంలో ఇతడు కూడా బాగా పనికి వస్తాడు. ఇతన్ని కూడా వద్దనుకుంటే , రిచార్డ్ గ్లీసన్ అరే ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ కూడా అద్భుతంగా రాణించగలుగుతాడు. సౌత్ ఆఫ్రికా 20 లీగ్ లో ( SA 20) కూడా అదరగొడుతున్నాడు. అలాగే అల్జారీ జోసఫ్ ను ( Alzarri Joseph ) కూడా కేకేఆర్ పరిశీలనలో ఉంచిందట. రీచ‌ర్డ్ సన్ ను కూడా సంప్రదిస్తోందట కేకేఆర్ యాజమాన్యం. అలాగే స్పెన్సర్స్ జాన్సన్ అనే ఆస్ట్రేలియా ఆటగాడు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలా దాదాపు అరడజన్ ప్లేయర్లపై కన్నేసింది కేకేఆర్. ఇందులో ఎవరినైనా రెండు కోట్లకే జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ సిద్ధమైదట.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×