E-Paper
Advertisement

KKR Vs SRH IPL Final Preview: నేడే ఐపీఎల్ ఫైనల్.. కోల్‌కతా Vs హైదరాబాద్.. ట్రోఫీ వరించేదెవరినో?

KKR Vs SRH IPL Final Preview: నేడే ఐపీఎల్ ఫైనల్.. కోల్‌కతా Vs హైదరాబాద్.. ట్రోఫీ వరించేదెవరినో?
Advertisement

IPL 2024 Final Match – KKR Vs SRH Preview and Prediction: ఐపీఎల్ 2024 సీజన్‌లో హీరో ఎవరో తెలిసిపోయేది నేడే. ట్రోఫీ కోసం పది జట్లు పోటీపడగా చివరకు మిగిలినవి రెండు జట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో పోటీ పడనున్నాయి.

దీంతో చివరి పోరు రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు రెండో ట్రోఫీ కోసం హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ, మరోవైపు మూడో ట్రోఫీ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

చెన్నై MA చిదంబరం స్టేడియం( చెపాక్) వేదికగా జరగనున్న ఫైనల్లో ఆదివారం రాత్రి 7:30 గంటలకు SRH, KKR చివరి సమరానికి సై అంటున్నారు. ఈ సీజన్‌లో కోల్‌కతాతో ఆడిన రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలయ్యింది. దీంతో ఎలాగైనా రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతోనే తలపడింది. ఈ మ్యాచులో SRH గెలుపు ముంగిట బోల్తా పడింది. ఇక క్వాలిఫైయర్-1లో కోల్‌కతా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించి నేరుగా ఫైనల్ చేరుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్‌లో నెగ్గిన రాజస్థాన్‌‌తో తలపడాల్సి వచ్చింది. క్వాలిఫైయర్‌-2లో అన్ని విభాగాల్లో రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ ఎగురేసుకుపోవాలని ప్రణాలికలు రచిస్తోంది.

Advertisement

Also Read: ఐపీఎల్ ఫైనల్.. మెరీనా బీచ్‌లో ట్రోఫీతో ఫోజులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇప్పటివరకు 27 మ్యాచుల్లో తలపడగా కేవలం తొమ్మిదింట్లో మాత్రమే విజయం సాధించింది. 18 మ్యాచుల్లో కోల్‌కతా విజయం సాధించింది.

KKR vs SRH పిచ్ రిపోర్ట్
చెపాక్ స్లో పిచ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా స్పిన్నర్లకు, స్లో బౌలర్‌లకు సహాయం చేస్తుంది. అయితే, ఈ వేదికలో ఎక్కువ స్కోర్లు నమోదయ్యే ఆస్కారం తక్కువ.

KKR vs SRH వాతావరణం
మ్యాచ్ సమయంలో చెన్నైలో ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీలు ఉంటుంది, కానీ 37 డిగ్రీలుగా అనిపిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. AccuWeather ప్రకారం తేమ దాదాపు 66% ఉంటుంది. వర్షం పడే అవకాశం 3% ఉంది.

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×