BigTV English

KKR vs SRH IPL 2024 Final: రేపే ఐపీఎల్ ఫైనల్.. మెరీనా బీచ్‌లో ట్రోఫీతో ఫోజులు..

KKR vs SRH IPL 2024 Final: రేపే ఐపీఎల్ ఫైనల్.. మెరీనా బీచ్‌లో ట్రోఫీతో ఫోజులు..

Shreyas Iyer, Pat Cummins With Trophy ahead of KKR vs SRH 2024 Final: ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుకుంది. సీజన్‌లో ఇంకొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. చెన్నైచెపాక్ వేదికగా కోల్ కతా నైట్‌రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.


అయితే రెండు జట్ల కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ ట్రీఫీతో తెగ ఫోజులిచ్చారు. ఇందులో భాగంగా శనివారం చెన్నై మెరినా బీచ్‌లో అయ్యర్, కమిన్స్ ట్రోఫీతో దిగిన ఫోటోను ఐపీఎల్ తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది.

రెండో టైటిల్ కోసం సన్‌రైజర్స్ ఎదురుచూస్తుండగా మూడో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని కోల్‌కతా ఆరాటపడుతుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటికి రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచుల్లో కోల్‌కతా విజయం సాధించింది.


పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్లు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా.. హైదరాబాద్‌ను చిత్తు చేసింది. దీంతో క్వాలిఫైయర్ 2 ఆడిన సన్‌‌రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్ చేరుకుంది. ఆదివారం(మే 26)న చెన్నై ఎం ఏ చిదంబరం స్టేడియం(చెపాక్) వేదికగా ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read: కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ తడ’బ్యాటు’.. 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కోల్‌కతా

అందులో భాగంగా ట్రోఫీతో ఫోజులిచ్చారు ఇద్దరు కెప్టెన్లు. పడవ మీద కూర్చొని సరదాగా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×