E-Paper
Advertisement

Ind vs Sa Odi Squad: రుతురాజ్ వ‌చ్చేశాడు, వన్డేలకు కొత్త కెప్టెన్‌..ద‌క్షిణాఫ్రికాతో ఆడే వ‌న్డే జ‌ట్టు ఇదే

Ind vs Sa Odi Squad: రుతురాజ్ వ‌చ్చేశాడు, వన్డేలకు కొత్త కెప్టెన్‌..ద‌క్షిణాఫ్రికాతో ఆడే వ‌న్డే జ‌ట్టు ఇదే
Advertisement

Ind vs Sa Odi Squad: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India). ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే వన్డేలకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఎవరు ఊహించని విధంగా కేఎల్ రాహుల్ ( KL Rahul) కు కెప్టెన్సీ అవకాశం కల్పించింది బీసీసీఐ. 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గా తాత్కాలికంగా కేఎల్ రాహుల్ ఉండనున్నాడు. శుభ్ మ‌న్‌ గిల్ అలాగే శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు గాయాల బారిన పడ్డ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కు అవకాశం కల్పించారు. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ పేరు ప్రకటించింది బీసీసీఐ (BCCI).

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

రుతురాజ్ వ‌చ్చేశాడు, వన్డేలకు కొత్త కెప్టెన్‌

Advertisement

టీమిండియా కెప్టెన్ గిల్ మెడ నొప్పి బారిన పడ్డాడు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పక్కటెముకల దగ్గర తీవ్ర గాయమైంది. దీంతో లోపల రక్తస్రావం జరిగింది. ఈ రెండు గాయాల కారణంగా గిల్ తో పాటు శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు దక్షిణాఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ కు దూరం కాబోతున్నారు.

ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ ఇచ్చిన బీసీసీఐ, రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. బూమ్రాతో పాటు సిరాజ్ కు రెస్ట్ ఇచ్చారు. జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా ఈ లిస్టులో లేరు. సంజు శాంసన్ కు కూడా ఛాన్స్ దక్కలేదు. అనూహ్యంగా రుతురాజుతో పాటు జైష్వాల్ ఇద్దరూ తుది జట్టులోకి వచ్చారు. తిలక్ వర్మ కూడా వన్డే జట్టులోకి రావడం జరిగింది. అయితే, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్ ల‌కు రెస్ట్ ఇవ్వ‌డంపై ర‌హ‌స్యం ఉంది. వీళ్ల‌కు ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే టీ20ల‌కు ఛాన్సు ఇవ్వ‌నున్నారు. అటు పెళ్లి కూడా కుల్దీప్ యాద‌వ్ ( kuldeep yadav) వాయిదా వేసుకుని, వ‌న్డే సిరీస్ ఆడుతున్నాడు.

ద‌క్షిణాఫ్రికాతో ఆడే టీమిండియా వ‌న్డే జ‌ట్టు ఇదే

Advertisement

Team India: రోహిత్ శ‌ర్మ‌, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వ‌ర్మ‌, KL రాహుల్ (C) (WK), రిష‌బ్ పంత్ (WK), సుందర్, జడేజా, కుల్దీప్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్ష దీప్‌, ధృవ్ జురెల్

 

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

 

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×