E-Paper
Advertisement

Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్!

Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్!
Advertisement

Jeevan Reddy: జగిత్యాలలో నిన్న డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నందయ్యకు సన్మాన కార్యక్రమం మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటైన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభివృద్ధిపై సూటి ప్రశ్నలు సంధించారు. ‘నువ్వు పదేళ్లు ఏ అభివృద్ధి ఇరగపెట్టినావ్?’ అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ నాయకులకు చేతకాని అభివృద్ధి నీకు చేతనవుతుందా?’ అంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే ఎలా చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ విధానాలపై కూడా జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి ముఖ్యమంత్రి గుర్తింపు ఇస్తున్నారని..కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రం తగిన గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి పార్టీగా అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ తన బిడ్డలను ఖచ్చితంగా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా, జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశాయి. ‘లక్ష్మణ్ అన్నకు కోపం వచ్చిన మంచిదే’ అని పేర్కొంటూ.. ‘మా పోటీ పక్క వాళ్ల‌తో కాదు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే’ అంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వానికి పోటీని పెంచుతున్నట్లు సూచిస్తున్నాయి. జగిత్యాలలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం, స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు, ముఖ్యమంత్రిపై పెరుగుతున్న అంతర్గత అసంతృప్తికి వేదికగా మారింది. రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Advertisement

ALSO READ: CM Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×