E-Paper
Advertisement

Seetha Prayanam Krishna Tho Movie Review : ‘సీత ప్రయాణం కృష్ణతో” మూవీ రివ్యూ

Seetha Prayanam Krishna Tho Movie Review : ‘సీత ప్రయాణం కృష్ణతో” మూవీ రివ్యూ
Advertisement

Seetha Prayanam Krishna Tho Movie Review : దేవేందర్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘సీత ప్రయాణం కృష్ణతో’. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్ ఖుషి టాకీస్ పై డా. రాజీవ్, డా. రోజా భారతి నిర్మించిన ఈ సినిమాలో రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ తదితరులు నటించారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో రివ్యూ లో తెలుసుకుందాం.

కథ :

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ క్రిష్, సీత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత ఉద్యోగ రిత్యా ఈ జంట సిటీలో సెటిల్ అవుతారు. ఈ క్రమంలోనే క్రిష్ కు ఆఫీస్ లో రాధిక పరిచయం అవ్వడం, ఆమెతో వ్యవహారం ప్రేమదాకా వెళ్లడం జరుగుతుంది. అలా రాధికా బుట్టలో పడిన క్రిష్ తన భార్యను పూర్తిగా పట్టించుకోవడం మానేస్తాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలవుతాయి. ఫలితంగా సీక్రెట్ గా సీత ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ నిర్ణయం వల్ల ఈ జంట జీవితంలో జరిగిన మార్పులేంటి? చివరికి ఈ జంట దాంపత్యం ఎలాంటి టర్న్ తీసుకుంది? క్లైమాక్స్ ఏంటి? అనేది తెలియాలంటే ‘సీత ప్రయాణం కృష్ణతో’ సినిమాను తెరపై చూడాల్సిందే..

విశ్లేషణ :

Advertisement

హస్బెండ్ వేరొకరి మాయలో పడి భార్యను పట్టించుకోకపోతే, తిరిగి అదే పని తన వైఫ్ చేస్తే ఏంటి పరిస్థితి అన్నదే ఈ సినిమా కథ. సినిమాను చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సీన్ లో తమ రియల్ లైఫ్ కు కనెక్ట్ అవుతారు. ఒకరకంగా చెప్పాలంటే స్క్రీన్ పై తమను తాము చూసుకుంటారు ఆడియన్స్. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడికే చెందుతుంది. కానీ డబ్బింగ్ విషయంలో డిసప్పాయింట్ చేశారు.

మొదటి సినిమానే అయినపప్పటికీ క్రిష్ పాత్రలో దినేష్ బాగా నటించాడు. హీరోయిన్ గా సీత పాత్రలో డాక్టర్ రోజా భారతి అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. సెకండ్ హీరోయిన్ రాకేష్ శర్మ తనకిచ్చిన రాధిక రోల్ లో పరవాలేదు అన్పించింది. మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. టెక్నికల్ అంశాల పరంగా చూస్తే… సంగీత దర్శకుడు శర్వణ వాసుదేవన్ మ్యూజిక్, డిఓపి రవీంద్ర కెమెరా వర్క్, విశ్వనాథ్ ఎడిటింగ్ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

Advertisement

స్టోరీలైన్
నటీనటులు
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

డబ్బింగ్
నిర్మాణ విలువలు

మొత్తానికి ‘సీత ప్రయాణం కృష్ణతో’ ఓసారి థియేటర్లలో చూడదగ్గ మూవీ.

Seetha Prayanam Krishna Tho Movie Rating : 2.5/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×