Kris Srikkanth On IND VS NZ: న్యూజిలాండ్ మధ్య జరగనున్న వన్డే టెస్ట్ సిరీస్ నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఇందులో మహమ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. అటు టీ20లకు సెలెక్ట్ అయిన భువనేశ్వర్ ను కూడా పట్టించుకోలేదు. ఈ క్రమంలో టీమిండియా సెలక్షన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా మండిపడ్డారు. దరిద్రుడు అగార్కర్ పోయినా రాత మారలేదే…షమీ, భువీలను నట్టేట ముంచారు కదరా? అంటూ క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంటులో ఆడిన బౌలర్లను తీసుకువచ్చి టీమిండియా పై రుద్దుతున్నారని ఆగ్రహించారు.
గౌతమ్ గంభీర్ కుట్రల వల్ల మహమ్మద్ షమీ భువనేశ్వర్ కుమార్ లకు అవకాశాలు రావడంలేదని ఆగ్రహించారు. మొన్నటి వరకు అజిత్ అగార్కర్ ఉండడం వల్ల వీళ్లకు ఛాన్సులు రాలేదని అనుకున్నాం.. కానీ ఆ దరిద్రుడు వెళ్ళిపోయినా కూడా వీళ్ళ తలరాత మారడం లేదంటూ ఘాటుగా విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ అలాగే భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ క్రికెటర్లు లేకుండా ఎలాంటి ట్రోఫీలు గెలవలేమని… సెలెక్ట్ చేసిన యంగ్ బౌలర్లతో ట్రోఫీలు రావడం కష్టమేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఈ తరుణంలోనే టీమిండియా సెలక్షన్ పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
న్యూజిలాండ్ సిరీస్ కోసం సెలెక్ట్ అయిన గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, అకీబ్ నబీ, అన్షుల్ కంబోజ్ లాంటి బౌలర్లపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహించారు. వీళ్లకు ఏం అనుభవం ఉందని సెలెక్ట్ చేశారని నిలదీశారు. ఐపీఎల్ జట్టులోనే సరిగ్గా వీళ్ళకు అవకాశాలు రావాలని… అలాంటోళ్లను నేరుగా టీమిండియాలోకి తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. మహమ్మద్ షమీ అలాగే భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ క్రికెటర్లు టీమిండియా వన్డే జట్టులోకి వచ్చేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. దానికి తగ్గట్టుగా ఈ ఇద్దరు బౌలర్లు ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ… సెలెక్ట్ చేయకపోవడం దారుణం అన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో… భువనేశ్వర్ కుమార్ అలాగే మహమ్మద్ షమీలను ఇప్పటి నుంచే అవకాశాలు ఇచ్చి, వాళ్లను మరింత షైన్ చేయాలన్నారు. భువీ, షమీలను కాకుండా మిగతా బచ్చాగాళ్లను 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సెలక్ట్ చేస్తే, ట్రోఫీ రావడం కష్టమేనని కుండబద్దలు కొట్టి చెప్పారు.