E-Paper
Advertisement

అమ్ముడుపోయిన అంపైర్..హెల్మెట్ నేలకేసి కొట్టిన స్ట‌బ్స్, రంగంలోకి బ‌దానీ

అమ్ముడుపోయిన అంపైర్..హెల్మెట్ నేలకేసి కొట్టిన స్ట‌బ్స్, రంగంలోకి బ‌దానీ
Advertisement

CSK VS DC:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) రోజుకో వివాదం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో 18 మ్యాచులు పూర్తయ్యాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Chennai Super Kings vs Delhi Capitals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్, ఎట్టకేలకు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో గ్లోవ్స్ ( stubbs gloves ) మార్చుకునేందుకు అంపైర్ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. ఈ నిర్ణయం నేప‌థ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్ ( Tristan Stubbs) సీరియస్ అయ్యాడు. తాను ఔట్ అయిన‌ తర్వాత బ్యాట్ ను కింద‌పడేసి హెల్మెట్ నేలకేసి కొట్టాడు. డ్రెస్సింగ్ రూంలో కూడా ర‌చ్చ ర‌చ్చ చేశాడు స్ట‌బ్స్‌. ఈ సంఘటనలో అంపార్ ను ఒప్పించేందుకు కోచ్ హేమంత్ బ‌దానీ, ఇత‌ర ఢిల్లీ ప్లేయ‌ర్లు వచ్చినా కూడా త‌గ్గ‌లేదు. దీంతో ఈ మ్యాచ్ లో చివ‌ర‌లో స్ట‌బ్స్ చేసిన ప‌ని హాట్ టాపిక్ అయింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ కు అంపైర్లు అమ్ముడుపోయార‌ని అందుకే స్ట‌బ్స్ ఔట్ అయ్యాడ‌ని ఢిల్లీ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు.

Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే

ఐపీఎల్ లో CSK ఫ‌స్ట్ విజ‌యం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా నిర్వహించారు. అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది హోం గ్రౌండ్. దానికి తగ్గట్టుగానే రాణించి ఈ మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 212 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో చెన్నై విక్టరీ అందుకుంది. చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో ట్రిస్టాన్ స్టబ్స్ ( Tristan Stubbs) వ్యవహారం వివాదంగా మారింది. ఈ మ్యాచ్ లో 60 పరుగులు చేసిన ట్రిస్టాన్ స్టబ్స్, ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేశాడు.

హెల్మెట్ నేలకేసి కొట్టిన స్ట‌బ్స్

అయితే 19వ ఓవర్ లో బ్యాటింగ్ చేస్తున్న ట్రిస్టాన్ స్టబ్స్ కు గ్లోవ్స్ సమస్య ఏర్పడింది. దీంతో రెండు బంతులు పడిన తర్వాత కొత్త గ్లోవ్స్‌ కోసం అంపైర్ ప‌ర్మిష‌న్‌ తీసుకున్నాడు స్ట‌బ్స్‌. కానీ రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్‌, సమయం లేదని నో చెప్పాడు. పాత గ్లోవ్స్ తోనే బ్యాటింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఢిల్లీ కోచ్ హేమంగ్ బదానీ వచ్చి వాదించినప్పటికీ కూడా అంపైర్ వినలేదు. దీంతో పాత గ్లోవ్స్ తో ఆడిన స్ట‌బ్స్‌ వెంటనే ఔట్ అయ్యాడు. క్యాచ్ ఔట్ అయిన వెంటనే, అంపైర్ పై తన ఆవేశాన్ని వెళ్ళగక్కుతూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు స్ట‌బ్స్‌. ఈ క్రమంలో బ్యాట్ ను వదిలేసి, హెల్మెట్ ను నేలకేసి కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంపైర్లు అమ్ముడుపోయారని.. ఇది కూడా ఫిక్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Advertisement

Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగ‌రేట్ తాగి, న‌డిరోడ్డుపైనే..ఏం బ‌తుకురా నీది

?igsh=MXMwODV0Z3B4ZWVudA==

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×