Chahal Smoking: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతుంద నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) వివాదంలో చిక్కుకున్నాడు. కారులో వెళ్తూ స్మోకింగ్ చేసిన యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal Smoking), సిగరెట్ పీకను నడిరోడ్డుపైన విసిరేశాడు. రన్నింగ్ కారులో వెళ్తుండగా ఈ చెండాలమైన పనిని యుజ్వేంద్ర చాహల్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. బాధ్యత గల హోదాలో ఉన్న చాహల్ ఇలాంటి పనిచేయడం సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
రోడ్లపైన చెత్త ఉంటేనే ఈ మధ్యకాలంలో జరిమానాలు లేదా జైలు శిక్షలు విధిస్తున్నారు. అలాంటిది పంజాబ్ కింగ్స్ స్టార్ట్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ మాత్రం సిగిరెట్ తాగి రోడ్డుపైన పడేశాడు. కారు రన్నింగ్ లో ఉండగానే, లోపలి నుంచి నడిరోడ్డు పైన వేశాడు. అయితే అదే సమయంలో పక్కన వెళ్లే వారి పైన ఆ సిగరెట్ పీక పడితే పెద్ద ప్రమాదమే జరిగేది. అదేమీ ఆలోచించకుండా హీరో రేంజ్ లో కారులో వెళ్తూ, తాగిన సిగరెట్ పీకను నడిరోడ్డు పైన పడేసాడు చాహల్.
ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో అతనిపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన న్యూ చండీగఢ్ వేదికగా జరిగినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో చాహల్ రోడ్డుపై ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా పంజాబ్ కింగ్స్ స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) టీమిండియాలో ఛాన్స్ కోల్పోయి, కేవలం ఐపీఎల్ లో మాత్రమ ఆడుతున్నాడు. ఇక శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహల్ ఆడనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings vs Sunrisers Hyderabad ) మధ్య 17 వ మ్యాచ్ జరగనుంది. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవింద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే పంజాబ్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి రికార్డులు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ ఇందులో గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు.
Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్, రహానే ఇద్దరూ నాటౌటే !
?igsh=MTE3NXZyNW52YjRkOA==
🚨 Meet Yuzvendra Chahal, caught smoking a cigarette and carelessly throwing it onto the road.
All that money and still no class, no civic sense. Disgusting pic.twitter.com/joHVrkbGPL
— Wickets Hitting (@offpacedelivery) April 10, 2026