E-Paper
Advertisement

Lalit Modi: అన‌వ‌స‌రంగా గెలికిన లిలిత్ మోడీ..మ‌ళ్లీ ట్రోల్స్ మొద‌లు, కావ్య పాప దేశం వ‌దిలిపోవాల్సిందే అంటూ ?

Lalit Modi: అన‌వ‌స‌రంగా గెలికిన లిలిత్ మోడీ..మ‌ళ్లీ ట్రోల్స్ మొద‌లు, కావ్య పాప దేశం వ‌దిలిపోవాల్సిందే అంటూ ?
Advertisement

Lalit Modi: ఇండియన్ ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతిత్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad team) ఓనర్ కావ్య మారన్ ( Kavya Maran) ఓ వివాదంలో చిక్కుకుంది. ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కొనుగోలు చేసిన కావ్య పాప, ట్రోలింగ్ గురి అవుతోంది. ఆమెను దేశ ద్రోహి అని కూడా విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు సపోర్ట్ గా నిలిచేందుకు ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ ( Lalit Modi) రంగంలోకి దిగాడు. ఆ అమ్మాయి చేసిన తప్పేముందని సంచలన వ్యాఖ్యలు చేశారు లలిత్ మోడీ. రూల్స్ ప్రకారమే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిందని కావ్య పాపను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. దీంతో నెటిజెన్స్ ట్రోలింగ్ మరింత ఎక్కువ చేస్తున్నారు. నువ్వే పెద్ద మోసగాడివి… ఇండియాను మోసం చేసి పారిపోయావ్? నువ్వు నీతులు చెబుతున్నావా? అంటూ మళ్ళీ ట్రోల్లింగ్ మొదలుపెట్టారు నెటిజన్స్, క్రికెట్ అభిమానులు. లలిత్ మోడీ తరహాలోనే కావ్య పాప కూడా దేశం వదిలి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

అన‌వ‌స‌రంగా గెలికిన లిలిత్ మోడీ

Advertisement

ది హండ్రెడ్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ఏరి కోరి కొనుగోలు చేసింది కావ్య పాప. 2.34 కోట్లు పెట్టి మరి అతన్ని కొనేసింది. దీంతో పాకిస్తాన్ వాడికి ఎలా డబ్బులు పెడతావని కావ్య పాపను ఆడుకుంటున్నారు జనాలు. ఇలాంటి నేపథ్యంలో ఈ సీన్ లోకి లలిత్ మోడీ ఎంట్రీ ఇచ్చారు. కావ్య పాపకు సపోర్ట్ గా నిలుస్తూ సందేశం పంపారు లలిత్ మోడీ. క్రికెట్ అనేది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండేది.. ఇలాంటి వాటిలో రాజకీయాల జోక్యం ఉండకూడదని పేర్కొన్నారు. క్రీడాలకు, రాజకీయాలకు సమదూరం పాటించాలని వెల్లడించారు. అందులో భాగంగానే రూల్స్ ప్రకారం పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిందని వెల్లడించారు.

విదేశీ టోర్నమెంట్స్ లో ఏ ప్లేయర్నైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేసే హక్కు ఉంటుందని వెల్లడించారు లలిత్ మోడీ. కావ్య పాప కూడా అదే పని చేసిందని వివరించారు. ఇందులో బీసీసీఐకి లేని నొప్పి అభిమానులకు ఎందుకు వచ్చిందని పరోక్షంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో కారు కూతలు కూస్తూనే ఉంటారని, వాటికి మీరు భయపడకూడదని కావ్య పాపకు భరోసా కల్పించారు లలిత్ మోడీ. అయితే లలిత్ మోడీ పంపిన ఈ సందేశం నేపథ్యంలో నెటిజన్స్ మళ్లీ విరుచుకుపడుతున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో డబ్బులు అన్ని వెనుకేసుకొని.. దేశం వదిలి పారిపోయిన నువ్వు నీతులు చెబుతున్నావా ? అంటూ లలిత్ మోడీపై మండిపడుతున్నారు. నువ్వు పెద్ద ఛీట‌ర్‌, దేశ ద్రోహివి అంటూ సీరియ‌స్ అవుతున్నారు. నువ్వు దేశం వదిలి వెళ్లినట్లే కావ్య పాప కూడా ఇండియాను వదిలి పోవాలంటే మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. దీంతో లలిత్ మోడీ ఇచ్చిన సందేశం కావ్య పాపకు కొత్త త‌ల‌నొప్పి తీసుకువచ్చింది.

Advertisement

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

 

 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×