E-Paper
Advertisement

Maruti Cars 2026: 2026లో విడుదల కానున్న మారుతి కార్లు ఇవే, వీటిలో బెస్ట్ ఏదో తెలుసా?

Maruti Cars 2026: 2026లో విడుదల కానున్న మారుతి కార్లు ఇవే, వీటిలో బెస్ట్ ఏదో తెలుసా?
Advertisement

Maruti Cars Launching In 2026: లో మారుతి సుజుకి భారతీయ మార్కెట్లోకి ఒకే ఒక కొత్త కారును విడుదల చేసింది. విక్టోరిస్ మిడ్‌సైజ్ SUV. నిజానికి ఈ ఆటో మోబైల్ సంస్థ ఏడాదికి 2,3 వాహనాలను లాంచ్ చేస్తుంది. కానీ, ఈ ఏడాది ఒకే ఒక్క కారును విడుదల చేసింది. 2026 మారుతి సుజుకికి తిరిగి ఫామ్‌లోకి వచ్చేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ కంపెనీ తన పోర్ట్‌ ఫోలియోకు రెండు EVలు, ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ ను యాడ్ చేయబోతోంది. అటు బ్రెజా కాంపాక్ట్ SUVని అప్‌ డేట్ చేయబోతోంది. 2026లో లాంచింగ్ కు రెడీ అవుతున్న మారుతి సుజుకి కార్లను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ మారుతి సుజుకి ఇ విటారా

ఈ కారు జనవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత్ లో మారుతి సుజుకి తొలి EVగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఇ విటారా జనవరి 2026లో అందుబాటులోకి రానుంది. ఇ విటారా మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, విన్‌ఫాస్ట్ VF6, టాటా కర్వ్ EV లాంటి వాటికి పోటీగా ఉంటుంది. మారుతి ఇ విటారా 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్స్ తో అందుబాటులోకి వస్తుంది. రెండూ ఫ్రంట్ మౌంటెడ్ మోటారుకు వైర్ చేయబడతాయి. ఇ విటారా 543 కి.మీ రేంజ్ అందించనుంది. ఈ ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ SUV 5-స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్‌ను కలిగి ఉంది.

⦿మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్  ఫ్యూయల్

Advertisement

ఈ కారు 2026 మిగ్ ఇడియర్ లో లాంచ్ కానుంది. మారుతి సుజుకి తొలి EVతో పాటు, మారుతి సుజుకి ఫస్ట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనుంది. ఇది ఫ్రాంక్స్ కాంపాక్ట్ SUV బోనెట్ కింద అందుబాటులో ఉంటుంది. వివరాలు సీక్రెట్ గా ఉన్నాయి. ఈ కారులోని ఇంజిన్ 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. దాని ఇంజిన్‌తో పాటు, ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ డిజైన్,  ప్రస్తుత మోడల్‌ తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు.

⦿ మారుతి సుజుకి ‘YMC’ ఎలక్ట్రిక్ MPV

ఈ కారు 2026 ఎండింగ్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి నుండి వచ్చిన రెండవ EV e Vitara ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ MPV ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంటుంది. ‘YMC’ అనే కోడ్‌నేమ్ ఉన్నమారుతి సుజుకి మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ MPV అవుతుంది. ఇది ఎర్టిగా, XL6 పై రేంజ్ లో ఉంటుంది. YMC కియా కారెన్స్ క్లావిస్ EVకి పోటీగా ఉండవచ్చు. e Vitara లాగానే, YMC 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందించబడుతుంది. ఈకారు 550km పరిధిని అందించనుంది.

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

Advertisement

ఈ కారు 2026 మిగ్ ఇయర్ లో లాంచ్ కానుంది. సెకెండ్ జెనరేషన్ బ్రెజా నాల్గవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున, మారుతి సుజుకి కాంపాక్ట్ SUV కోసం ఫేస్‌లిఫ్ట్‌ను రెడీ చేస్తోంది. బ్రెజా ఫేస్‌ లిఫ్ట్ టెస్ట్ మ్యూల్స్  ఇటీవలి స్పై షాట్స్ డిజైన్‌కు చిన్న సవరణలు చేయనుంది. విక్టోరిస్ మాదిరిగానే అండర్ బాడీ CNG ట్యాంక్ సెటప్‌ తో అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. బ్రెజా ఫేస్‌ లిఫ్ట్ 103hp 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ల ఎంపికతో పాటు CNG ఎంపికను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:  రూ. 15 లక్షల లోపు ఆటోమేటిక్ కార్లు, వీటిలో బెస్ట్ ఏదంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×