E-Paper
Advertisement

Lionel Messi Statue: 70 అడుగుల మెస్సీ విగ్రహం ఆవిష్కరణ, స్టేడియం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త..వాట‌ర్ బాటిల్స్ విసిరిన ఫ్యాన్స్‌

Lionel Messi Statue: 70 అడుగుల మెస్సీ విగ్రహం ఆవిష్కరణ, స్టేడియం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త..వాట‌ర్ బాటిల్స్ విసిరిన ఫ్యాన్స్‌
Advertisement

Lionel Messi Statue:  మన ఇండియాలో ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) టూర్ కొనసాగుతోంది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇండియాకు చేరుకున్న లియోనెల్ మెస్సీ కోల్ క‌తాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. అయితే ప్రస్తుతం కోల్ క‌తాలో ఉన్న లియోనెల్ మెస్సీ, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కోల్ క‌తాలో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని ( Lionel Messi Statue) సాల్ట్ లేక్ స్టేడియం  నుంచి వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో లియోనెల్ మెస్సీని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ( Shah Rukh Khan) కూడా కలిశారు. ఇక కోల్ క‌త్తా స్టేడియం వద్ద లియోనెల్ మెస్సీకి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

లియోనెల్ మెస్సీ కోల్ క‌తా పర్యటనలో ఉద్రిక్తత

Advertisement

కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ( Salt Lake event ) ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) పర్యటన కొనసాగుతోంది. కాసేపటికి క్రితమే లియోనెల్ మెస్సీకి చెందిన‌ 70 అడుగుల విగ్రహాన్ని కూడా లాంచ్ చేశారు. అయితే ఈ సందర్భంగా కోల్ క‌తా సాల్ట్ లేక్ స్టేడియంలో గందర గోళ‌ పరిస్థితిలు ఏర్పడ్డాయి. లియోనెల్ మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరేసినట్లు తెలుస్తోంది. బారీకేడ్లు దాటి స్టేడియంలోకి చొచ్చుకు వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. లియోనెల్ మెస్సీ కి సంబంధించిన ఫ్లెక్సీలు చించి వేసి నిర్వాహకులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. దీంతో ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ బృందం మొత్తం సొరంగం ద్వారా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటనతో స్టేడియం మొత్తం ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొన్నాయి. అయితే స్టేడియంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించిన వాళ్ళందరినీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో పోలీసులతో పాటు ఫ్యాన్స్ మ‌ధ్య‌ గందరగోళ‌ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

సాల్ట్ లేక్ స్టేడియంలో ( Salt Lake event ) మెస్సీ మ్యాచ్ రద్దు

కోల్‌కాతా సాల్ట్ లేక్ స్టేడియంలో ( Salt Lake event )  మెస్సీ మ్యాచ్ రద్దు అయింది. మెస్సీ మ్యాచ్ చూసేందుకు వేరే రాష్ట్రాల నుండి వచ్చామని, మ్యాచ్ ఆడకుండా వెళ్తే ఎలా అంటూ అభిమానులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.
నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, స్టేడియంలో గందరగోళం సృష్టించారు మెస్సీ అభిమానులు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని స్టేడియంలో టెంట్లు కూల్చేస్తూ, కుర్చీలు ధ్వంసం చేస్తూ విద్వంసం సృష్టించారు మెస్సీ అభిమానులు.

Advertisement

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×