E-Paper
Advertisement

IPL 2026: స‌చిన్ కొడుకు అర్జున్ కు అవ‌మానం..శార్దుల్ ఠాకూర్ కు బంప‌ర్ ఆఫ‌ర్ !

IPL 2026: స‌చిన్ కొడుకు అర్జున్ కు అవ‌మానం..శార్దుల్ ఠాకూర్ కు బంప‌ర్ ఆఫ‌ర్ !

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 జట్లు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాయి. నవంబర్ 15వ తేదీన రిటెన్షన్ లిస్టును అన్ని జట్లు ప్రకటించాల్సి ఉంది. డిసెంబర్ 15వ తేదీన ఐపీఎల్ మినీ వేలం ( IPL2026 auction ) జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా బీసీసీఐ ఫిక్స్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో రిటైన్, ట్రేడ్ ప్రక్రియపై అన్ని జట్లు ఫోకస్ చేశాయి. అయితే ముంబై ఇండియన్స్ అలాగే లక్నో సూప‌ర్ జెయింట్స్‌ మధ్య ట్రేడ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: IPL 2026 Released Players List: 10 ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది ప్లేయ‌ర్లు వీళ్లే..లిస్ట్ లో ర‌షీద్‌, ష‌మీ కూడా?

శార్దుల్ ఠాకూర్ కు ఆఫర్…అర్జున్ ఔట్‌

ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) అలాగే లక్నో సూప‌ర్ జెయింట్స్ ( Lucknow Super Giants) మధ్య ట్రేడ్ ప్రక్రియ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. లక్నో సూప‌ర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను ( Shardul Thakur ) తీసుకుని ఎందుకు ముంబై ఇండియన్స్ ఆసక్తిగా ఉందట. అయితే శార్దూల్ ఠాగూర్ ను తీసుకుని సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను ( Arjun Tendulkar ) ట్రేడ్ ప్రక్రియ ( IPL trade) ద్వారా ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ ముందుకు వచ్చిందట. దీనికి లక్నో సూపర్ జెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీనిపై అతి త్వరలోనే ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముంబై రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్టు ఇదే

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ చాలామంది ప్లేయర్లను వదిలేసేందుకు సిద్ధమైంది. ఈ లిస్టులో ముజీబ్-ఉర్-రెహ్మాన్, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంక, సత్యనారాయణ రాజు,
రఘు శర్మ, రీస్ టోప్లీ, దీపక్ చాహర్ ( Deepak Chahar) ఉన్నారు. ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మను కూడా వదిలేసేందుకు ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రోహిత్ శర్మను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇచ్చేసి ఆ జట్టుకు సంబంధించిన ఓపెనర్ హెడ్ ను ట్రేడ్ ప్రక్రియ ద్వారా తీసుకునేందుకు స్కెచ్ లు వేస్తోంది అంబానీ గ్రూప్ ( Ambani Group).

ఇక ఈ ఆఫ‌ర్ కు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్ కావ్య పాప ఓకే చెప్పినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఇషాన్ కిష‌న్ ను మ‌రోసారి త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు కూడా ముంబై ఇండియ‌న్స్ ప్లాన్ చేస్తోంద‌ట‌. కానీ కావ్య పాప ఒప్పుకోలేద‌ని స‌మాచారం. ఇలా ప్ర‌తీ ప్లేయ‌ర్‌పై ముంబై ఇండియ‌న్స్ క‌న్నేసింది. అదే స‌మ‌యంలో IPL 2026 మినీ వేలానికి ముందు LSG కూడా కొంత‌మంది ఆటగాళ్లను విడుదల చేయ‌నుంద‌ట‌. షమర్ జోసెఫ్, హిమ్మత్ సింగ్, అబ్దుల్ సమద్, మాథ్యూ బ్రీట్జ్కే, ఆకాష్ సింగ్,  డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయ‌ర్ల‌ను LSG ఆటగాళ్లను విడుదల చేయ‌నుంద‌ట‌.

Also Read: Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

 

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×