E-Paper
Advertisement

OTT Movie : శోభితా ధూళిపాళ్లను మెచ్చిన వివాదాస్పద మూవీ… ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : శోభితా ధూళిపాళ్లను మెచ్చిన వివాదాస్పద మూవీ… ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
Advertisement

OTT Movie : ఈ ఏడాది వివాదాలతో పాపులర్ అయిన సినిమా ‘బ్యాడ్ గర్ల్’. బ్రాహ్మణులను కించపరిచారని విమర్శలు వచ్చాయి. ఈ సినిమా నిర్మాతలు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్‌లపై దర్శకుడు జి. మోహన్ బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. దీంతో ఈ సినిమా కొన్ని సీన్స్ కి కత్తెర పెట్టి రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే శోభిత ధూళిపాళ ఈ సినిమా చూసిన తర్వాత తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తన ఫీలింగ్స్ ని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమాలలో ‘బ్యాడ్ గర్ల్’ కూడా ఒకటని చెప్పుకొచ్చింది. ఇది అమ్మాయిల మనో ధైర్యాన్ని పెంచే సినిమా అని, ‘బ్యాడ్ గర్ల్’ పోస్టర్ ని షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ ని పంచుకుంది శోభిత.

జియోహాట్‌స్టార్ లో

‘బ్యాడ్ గర్ల్’ (Bad girl) ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా సినిమా. దీనికి వర్ష భరత్ దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్ర (రమ్య) పోషించగా.. శాంతిప్రియ, హ్రిదు హరూన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ లో ప్రదర్శించిన తర్వాత సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : భర్తను చంపడానికి ఇద్దరమ్మాయిల ప్లాన్.. అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ టర్న్స్ ఉన్న కొరియన్ క్రైమ్ డ్రామా

స్టోరీ ఏమిటంటే

రమ్య అనే అమ్మాయికి చదువుపై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ జీవితం పట్ల ఎన్నో కలలు ఉంటాయి. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన రమ్య, తన తల్లిదండ్రులు కట్టు బాట్లను ఇష్టపడదు. ఇంట్లో అమ్మాయిల పట్ల కఠినంగా ఉండటంతో ఆమెలో స్వేచ్ఛ, తిరుగుబాటు స్వభావం బయటికి వస్తాయి. కాలేజ్ వయసులో రమ్యకు ప్రేమ అనుభవాలు ఎదురవుతాయి. ఆమెకు ఇద్దరు అబ్బాయిలతో పరిచయం ఏర్పడుతుంది. ఈ సంబంధాల ద్వారా ఆమె నమ్మకం, మోసాన్ని రుచి చూస్తుంది. ఈ దశలో ఆమె తీసుకునే నిర్ణయాలు కథను ముందుకు నడిపిస్తాయి. ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది అనేది ఎమోషనల్ గా చూపించడం జరిగింది. ముసలి వయసులో ఆమె తన కాళ్లపై తాను నిలబడి, జీవితంలో స్థిరపడాలని ప్రయత్నిస్తుంది. అప్పటికే ఆమెకు జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పి ఉంటుంది. ఈ కథ వాస్తవానికి దగ్గరగా, అమ్మాయిలలో చైతన్యం తెచ్చే విధంగా రూపొందింది.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×