E-Paper
Advertisement

LSG VS KKR: నిద్ర‌పోయిన అంపైర్..సిక్స‌ర్ వెళ్తే, బౌండ‌రీ ఇచ్చాడు, ద‌రిద్రం అంటే ల‌క్నోదే

LSG VS KKR: నిద్ర‌పోయిన అంపైర్..సిక్స‌ర్ వెళ్తే, బౌండ‌రీ ఇచ్చాడు, ద‌రిద్రం అంటే ల‌క్నోదే

LSG VS KKR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. ప్రతి మ్యాచ్ కూడా చివరి వరకు కొనసాగుతోంది. అయితే ఈ ఐపిఎల్ 2026 ప్రారంభమైన నుంచి ఏదో ఒక వివాదం మాత్రం తెరపైకి వస్తోంది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, వివాదాస్పద క్యాచ్ లు, రన్ అవుట్స్ లాంటివి చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants vs Kolkata Knight Riders) మధ్య మ్యాచ్ జరగగా… రిషబ్ పంత్ ( Rishabh pant ) భారీ సిక్సర్ కొట్టాడు. ఇది క్లియర్ గా సిక్స్ వెళ్లినప్పటికీ.. నిద్రపోయిన ఫీల్డ్ అంపైర్.. బౌండరీ అంటూ ప్రకటించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన లక్నో అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. కొంచమైనా అంపైర్ కు బుద్ధి ఉందా? వాడు ఏమైనా నిద్రపోయాడా? క్లియర్ సిక్స్ వెళ్ళినప్పుడు బౌండరీ ఎలా ఇస్తాడు ? ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

నిద్ర‌పోయిన అంపైర్..సిక్స‌ర్ వెళ్తే, బౌండ‌రీ ఇచ్చాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య 38వ మ్యాచ్ జరిగింది. ఏకనా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ కూడా నిర్వహించాల్సి వచ్చింది. అయితే చివరికి ఈ సూపర్ ఓవర్ లో కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ వివాద అంశం తెరపైకి వచ్చింది. కేకేఆర్ బౌలర్ కార్తీక్ త్యాగి 12 ఓవర్ వేశాడు. ఈ సందర్భంగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్… ఓ భారీ సిక్సర్ బాదాడు. అయితే సిక్సర్ వెళ్ళినప్పటికీ నిద్రపోయిన అంపైర్… దాన్ని బౌండరీగా ప్రకటించాడు. దీన్ని ఎవరు గమనించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ రెండు పరుగులు నష్టపోయింది. ఇక్కడ అంపైర్ సరైన నిర్ణయం తీసుకుంటే… సూపర్ ఓవర్ దాకా వెళ్లాల్సిన పని వచ్చేది కాదు.

చివరలో మహమ్మద్ షమీ మెరిపించిన మెరుపులకు లక్నో సులభంగా విజయం సాధించేది. కానీ అంపైర్ తప్పిదం కారణంగా రెండు పరుగులు నష్టపోయిన లక్నో… సూపర్ ఓవర్ దాక వెళ్లి ఓడిపోయింది. ఇది ఇలా ఉండగా కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 20 ఓవర్లు ఆడిన కేకేఆర్ 155 పరుగులకు అలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో లక్నో దుమ్ము లేపింది. దీంతో స్కోర్ ఈక్వల్ కాగా… సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఈ సూపర్ ఓవర్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఒకే ఒక పరుగు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రింకూ సింగ్ బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దీంతో కేకేఆర్ విక్టరీ అందుకుంది.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×