Amala Paul: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సినిమా జీవితాన్ని ఎంత బాధ్యతగా కొనసాగిస్తున్నారో.. అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మరీ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం.. మరొకరు తల్లిదండ్రులు అవ్వడం.. ఇలాంటి శుభవార్తలు అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ పండంటి పాపకు తండ్రి కాగా… మరొకవైపు దీపికా పదుకొనే మరొకసారి తల్లి కాబోతున్నానని అభిమానులతో ప్రకటించింది. ఈ శుభ సందర్భంలో మరొక హీరోయిన్ తన కొడుకుకి త్వరలో క్రైమ్ పార్ట్నర్ రాబోతున్నారు అంటూ ఒక క్యూట్ వీడియో షేర్ చేసింది.
ఆమె ఎవరో కాదు మలయాళీ బ్యూటీ అమలాపాల్. ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అమలాపాల్ తాజాగా తన సోదరుడు అభిజిత్ పాల్ త్వరలో తండ్రి కాబోతున్నారు అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది.. అభిజిత్ పాల్ ఆయన భార్య బేబీ బంప్ తో విదేశీ వీధుల్లో చుట్టేస్తూ షేర్ చేసిన ఆ క్యూట్ వీడియోని అమలాపాల్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ..” మరో చిన్న గుండె శబ్దం త్వరలో మా ఇంట్లో వినిపించబోతోంది. ఇలై తన చిన్న క్రైమ్ పార్ట్నర్ కోసం ఆగలేకపోతున్నాడు.. కాబోయే నూతన తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు” అంటూ అమ్మాయి డాన్స్ చేస్తున్న ఎమోజీని షేర్ చేసింది. అలాగే రెయిన్బో తో పాటు యూనికార్న్ బొమ్మ కూడా షేర్ చేయడంతో పండంటి ఆడబిడ్డకు త్వరలో అభిజిత్ తండ్రి కాబోతున్నాడా అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అభిజిత్ పాల్ విషయానికి వస్తే.. ఈయన కూడా తన సోదరీ అమలాపాల్ బాటలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ నటుడిగా మంచి పేరు దక్కించుకున్న ఈయన.. 2016 లో వచ్చిన దేవి సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఓరు ఇండియన్ ప్రణయ కథ, లైలా ఓ లైలా, ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన దేవి వంటి చిత్రాలలో నటించారు. ఇక తర్వాత అభిజిత్ అల్క అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు తల్లి కాబోతోంది. ఈ సందర్భంగా బేబీ పంపు ఫోటోషూట్ ని అమలాపాల్ తాజాగా పంచుకున్నారు.
ALSO READ:హీరోగా పాయల్ ప్రియుడు.. ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
నీల తామర అనే మలయాళ చిత్రం ద్వారా 2009లో వెండితెరకు పరిచయమైన అమలాపాల్.. ఆ తర్వాత వీరశేఖరన్ అనే తమిళ చిత్రంలో నటించింది. 2013 వరకు మలయాళం, తమిళ్ చిత్రాలతో అలరించిన అమలాపాల్ 2013లో ఇద్దరమ్మాయిలతో అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాయక్ , జెండాపై కపిరాజు, పిట్టకథలు అంటూ పలు చిత్రాలు చేసి ఆ తర్వాత వెండితెరకు దూరమైంది. మధ్యలో కొన్ని సిరీస్ లలో కూడా నటించిన విషయం తెలిసిందే.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==