E-Paper
Advertisement

Palash – Smriti: స్మృతి పెళ్లిపై మరో ట్విస్ట్… పలాష్ ముచ్చల్ తో ఎఫైర్ పై మేరీ డి’కోస్టా సంచలన పోస్టు!

Palash – Smriti: స్మృతి పెళ్లిపై మరో ట్విస్ట్… పలాష్ ముచ్చల్ తో ఎఫైర్ పై మేరీ డి’కోస్టా సంచలన పోస్టు!
Advertisement

Palash – Smriti: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలతో సందడిగా ఉన్న పెళ్లి మండపం.. స్మృతి తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆ తరువాత పలాశ్ కూడా ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడైంది.

Also Read: South Africa Coach statement: మా దెబ్బకు మోకాళ్లపై పడి, టీమిండియా ప్లేయర్లు ఏడవాల్సిందే

Advertisement

దీంతో ఆమె పెళ్లి వాయిదా పడడంతో క్రీడాభిమానులు, నెటిజెన్లు షాక్ అయ్యారు. దీనికి తోడు స్మృతి మందాన.. పలాశ్ తో ఉన్న ఫోటోలు అన్నింటిని సోషల్ మీడియా నుండి తొలగించడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పలాశ్ కి సంబంధించిన పలు చాటింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారడంతో వీరి పెళ్లి ఆగిపోయిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

 

మేరీ డి కోస్టా సంచలన పోస్ట్:

Advertisement

మేరీ డి కోస్టా అనే మహిళ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పలాశ్ ముచ్చల్ కి సంబంధించిన సీక్రెట్ చాటింగ్ స్క్రీన్ చాట్ ని పంచుకుంది. ఈ చాట్ లో స్మృతి మందానాతో తన సంబంధం లాంగ్ డిస్టెన్స్ లవ్ అని.. ఆమె ఎప్పుడూ క్రీడా పర్యటనలలో బిజీగా ఉంటుందని పలాశ్ పేర్కొన్నారు. అంతేకాకుండా అతడు చాట్ చేస్తున్న సదరు యువతీ అందాన్ని వర్ణించాడు. అలాగే ఆ చాట్ లో తెల్లవారుజామున 5 గంటలకు ముంబైలోని వెర్సోవ బీచ్ కి రావాలని, అక్కడ తనతో స్విమ్మింగ్ లో పాల్గొనాలని ఆహ్వానించాడు. అయితే సదరు యువతీ.. మీరు స్మృతి ని నిజంగా ప్రేమిస్తున్నారా..? అని ప్రశ్నించింది. దీనికి పలాశ్.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని బదులిచ్చాడు. సినిమా పనిలో గత మూడు నెలలుగా నేను బిజీగా ఉన్నానని పేర్కొన్నాడు. అయితే పెళ్లికి ముందే పలాశ్ గురించి మందాన ఫ్యామిలీకి తెలిసిందని.. ఇది తట్టుకోలేక ఆమె తండ్రి అస్వస్థతకు గురయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మేరీ డి కోస్టా ఎవరు అని తెలుసుకునేందుకు, ఈ చాట్ నిజమేనా అని తెలుసుకునేందుకు నెటిజెన్లు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మేరీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. “నన్ను వదిలేయండి” అన్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. తాను ఎప్పుడూ పలాశ్ ని కలవలేదని తేల్చి చెప్పింది.

Also Read: Sunil Gavaskar: ఈ ముగ్గురు ఇంకా కొన‌సాగితే, టీమిండియా మ‌రో జింబాబ్వే కావ‌డం ప‌క్కా ?

 

నేను పలాశ్ ని కలవలేదు:

తాను పలాశ్ ని ఎప్పుడూ కలవలేదని తేల్చి చెప్పింది డి కోస్టా. “మొదట చాట్ 2025 ఏప్రిల్ 29, మే 30 మధ్య జరిగింది. కాబట్టి ఆ పరిచయం ఒక నెల రోజులు మాత్రమే కొనసాగింది. నేను పలాశ్ ని ఎప్పుడు కలవలేదు. అతనితో ఏ విధమైన సంబంధం లేదు. ఈ విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజలు ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాలి..? నేను జూలైలో ఈ వివరాలు వెల్లడించాను. కానీ ఆ సమయంలో అతడు ఎవరో ఎవరికీ తెలియదు. కాబట్టి దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడెందుకు వాటిని వైరల్ చేస్తున్నారు. నేను కొరియోగ్రాఫర్ కాదు. నేను పలాశ్ చేతిలో మోసపోయిన వ్యక్తిని కూడా కాదు. నేను ఎవరనే దానిపై కూడా గందరగోళం నెలకొంది” అని పోస్ట్ చేసింది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by @unconditional_love_matters

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×