E-Paper
Advertisement

Sunil Gavaskar: ఈ ముగ్గురు ఇంకా కొన‌సాగితే, టీమిండియా మ‌రో జింబాబ్వే కావ‌డం ప‌క్కా ?

Sunil Gavaskar: ఈ ముగ్గురు ఇంకా కొన‌సాగితే, టీమిండియా మ‌రో జింబాబ్వే కావ‌డం ప‌క్కా ?
Advertisement

Sunil Gavaskar: సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ వైట్ వాష్ కి గురైన విషయం తెలిసిందే. ఈ ఏడాది కాలంలో ఇది రెండవ వైట్ వాష్. ఇలా సొంత గడ్డపై టీమిండియా టెస్టుల్లో ఘోర వైఫల్యం చెందడంతో ఇప్పుడు అందరూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో గౌహతి వేదికగా జరిగిన రెండవ టెస్ట్ అనంతరం స్టేడియంలోనే “గంభీర్.. డౌన్ డౌన్” అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేస్తున్నారు.

Also Read: Womens blind cricket: అంధుల క్రికెటర్లు ఇంత దారుణమా… కుళ్లిన పండ్లను తిని బ‌తికేస్తున్నారా?

Advertisement

 

గౌతమ్ గంభీర్ కి సపోర్ట్ గా నిలిచిన సునీల్ గవాస్కర్:

గౌతమ్ గంభీర్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్.. గౌతమ్ గంభీర్ కి సపోర్టుగా నిలిచారు. ఓటమికి కేవలం కోచ్ ని మాత్రమే బాధ్యుడిని చేయడం అన్యాయం అన్నారు సునీల్ గవాస్కర్. గంభీర్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. “గౌతమ్ గంభీర్ కారణంగా భారత్ ఐసీసీ టైటిల్స్ గెలిచినప్పుడు ఈ విమర్శకులు ఎక్కడున్నారు..? ఇప్పుడు ఓడిపోగానే ఎందుకు మాట్లాడుతున్నారు..? ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఎవరైనా గంభీర్ కి క్రెడిట్ ఇచ్చారా..? మైదానంలో ఆడేది ఆటగాళ్లు.. కోచ్ కాదు. జట్టు గెలిస్తే ఎవ్వరు గంభీర్ కి క్రెడిట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓడిపోగానే కోచ్ నీ విమర్శిస్తున్నారు. కోచ్ జట్టును సిద్ధం చేస్తారు. కానీ మైదానంలో ఆడేది ఆటగాళ్లే. జట్టు బాగా ఆడితే ఎవరూ కోచ్ పేరు ప్రస్తావించరు. కానీ ఓడిపోగానే కోచ్ ని టార్గెట్ చేస్తారా..? అప్పుడు మీరు గంభీర్ కి లైఫ్ టైమ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పారా..? లేదు కదా. అయితే ఇప్పుడు ఎందుకు ఆయనని సాగనంపాలని డిమాండ్ చేస్తున్నారు..? ” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

 

కోచ్ ని మారిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి:

హెడ్ కోచ్ గౌతమ్ తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని.. జట్టులో యువతను ప్రోత్సహించే విధానం సమయానుకూలమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కోచ్ ని మార్చడం జట్టుకు మంచిది కాదన్నారు. కొన్ని కొన్ని ప్రణాళికలు ఫలితాలు ఇవ్వడానికి సమయం పడుతుందని.. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులలో జట్టు వెనక నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Also Read: WTC FINAL 2027: WTC ఫైన‌ల్స్ కు వెళ్లే ఛాన్సులు ఇంకా ఉన్నాయా? టీమిండియా ఎన్ని గెలిస్తే సాధ్యం అంటే

ఇంగ్లాండ్ కి బ్రెండన్ మెక్ కలమ్ అన్ని ఫార్మాట్లకు కోచ్ గా ఉన్నాడని, చాలా దేశాల్లో ఇదే జరుగుతుందని, మనం మాత్రం ఓడిపోయినప్పుడు మాత్రమే కోచ్ ని తప్పుబడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు ఆడకపోవడమే అసలు సమస్య అని.. ఇందులో గంభీర్ ని ఎందుకు నిందిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×