E-Paper
Advertisement

IPL 2026: 1355 మంది ప్లేయర్లపై వేటు, 350 క్రికెటర్లకే ఛాన్స్.. ఐపీఎల్ మినీ వేలం కొత్త టైమింగ్స్ ఇవే

IPL 2026:  1355 మంది ప్లేయర్లపై వేటు, 350 క్రికెటర్లకే ఛాన్స్.. ఐపీఎల్ మినీ వేలం కొత్త టైమింగ్స్ ఇవే
Advertisement

IPL 2026: ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 సీజన్ కి సంబంధించిన మినీ వేలం ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఈ మినీ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీల సూచనలు, అవసరాలకు అనుగుణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} తుది జాబితాని ఖరారు చేసింది.

Also Read: Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య మళ్ళీ పాత గొడవలు? వీడియో వైరల్

Advertisement

భారీ సంఖ్యలో ఉన్న దరఖాస్తుల నుండి కేవలం 350 మంది ఆటగాళ్ళను మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది బీసీసీఐ. మిగిలిన వెయ్యికి పైగా ఆటగాళ్లకు ఈ వేలంలో పాల్గొనే అవకాశం దక్కలేదు. షార్ట్ లిస్ట్ అయిన 350 మంది క్రికెటర్లే వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించడానికి పోటీపడతారు. ఈ లిస్టులో మొదట పేరు నమోదు చేసుకోని 35 మంది ప్లేయర్లు కూడా చోటు దక్కించుకున్నారు. వీరిలో సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. అతని బేస్ ధర రూ. కోటిగా నిర్ణయించారు.

 

ఆస్ట్రేలియా నుండి భారీగా రిజిస్ట్రేషన్లు:

Advertisement

2025 ఐపీఎల్ తో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా నుండి భారీగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. మ్యాథ్యూ షార్ట్, కామెరున్ గ్రీన్, స్టీవ్ స్మిత్ ఎలాంటి స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. అంతకుముందు తన వివాహం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చు అని తెలిసిన జోష్ ఇంగ్లీస్ కూడా వేలానికి రిజిస్టర్ అయ్యాడు. ఇక ఇంగ్లాండ్ నుండి జేమీ స్మిత్, జానీ బెయిర్ స్టో.. న్యూజిలాండ్ నుండి రచిన్ రవీంద్ర, శ్రీలంక నుండి పతిరాణా, తీక్షణ, హసరంగ.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్ ఉల్హక్, ముజీబ్ వంటి వారు కూడా జాబితాలో ఉన్నారు. ఐపీఎల్ మినీ వేలం రిజిస్ట్రేషన్ లిస్టులో మొత్తం 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మలేషియా ఆటగాడు వీరందీప్ సింగ్ కూడా 30 లక్షల ప్రైస్ తో వేళానికి నమోదు అయ్యాడు.

Also Read: Virat Kohli: ద‌క్షిణాఫ్రికాపై తాండ‌వం… సింహాచలంలో ద‌ర్శ‌నం, కోహ్లీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరో !

 

ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్, మినీ వేలం కొత్త టైమింగ్స్:

ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 237.55 కోట్లు ఉండగా.. కలకత్తా నైట్ రైడర్స్ వద్ద భారీ పర్స్ ఉంది. కే.కే.ఆర్ వద్ద రూ. 64.3 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ రెండవ స్థానంలో ఉంది. సీఎస్కే వద్ద 43.4 కోట్లు ఉన్నాయి. డిసెంబర్ 16న జరగబోయే ఈ మినీ వేలం ద్వారా తమ జట్లలోని బలహీనతలను సరిదిద్దుకొని.. 2026 ఐపీఎల్ సీజన్ కి పటిష్టంగా సిద్ధం కావాలని ప్రాంచైజీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటలకు అబూదాభి వేదికగా ఈ ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.

 

 

View this post on Instagram

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×