E-Paper
Advertisement

Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య మళ్ళీ పాత గొడవలు? వీడియో వైరల్

Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య మళ్ళీ పాత గొడవలు? వీడియో వైరల్
Advertisement

Kohli – Gambhir: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ని కొనసాగించారు. మొదటి రెండు వన్డేలలో సెంచరీలతో మెరిసిన విరాట్ కోహ్లీ.. మూడవ వన్డేలో హాఫ్ సెంచరీతో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక రోహిత్ శర్మ మొదటి, చివరి వన్డేలలో హాఫ్ సెంచరీలతో జట్టుకు బలాన్ని ఇచ్చాడు.

Also Read: Virat Kohli: ద‌క్షిణాఫ్రికాపై తాండ‌వం… సింహాచలంలో ద‌ర్శ‌నం, కోహ్లీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరో !

Advertisement

ఈ సిరీస్ లో భారత్ విజయం సాధించడంలో వీరిద్దరి పాత్ర ఎంతో కీలకం. వీరిద్దరూ ఇప్పటికే టెస్ట్, టి-20 ల నుండి తప్పుకొని.. వన్డే ఫార్మాట్ పైనే దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ సీనియర్లు 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనే సంకల్పంతో ఉన్నారని సమాచారం. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు వీరికి స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

 

కోహ్లీ – గంభీర్ మధ్య విభేదాలు:

Advertisement

విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మలు టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంలోనే గౌతమ్ గంభీర్ తో వీరిద్దరికీ విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. వీరిద్దరూ టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక గంభీర్ ఒత్తిడి ఉందనే విమర్శలు వినిపించాయి. ఇక అప్పటినుండి వీరి మధ్య విభేదాలకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ – విరాట్ కోహ్లీ మద్య మరోసారి విభేదాలు నెలకొన్నట్లు నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ని టీమిండియా 2 – 1 తో కైవసం చేసుకున్న తర్వాత.. విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లు అందరినీ ఉత్సాహంగా కౌగిలించుకున్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మని హత్తుకోవడం మైదానంలో ఉన్న అభిమానులను ఎంతగానో అలరించింది. కానీ ఇదే ఉత్సాహం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దగ్గరకు వచ్చేసరికి కనిపించలేదు. గౌతమ్ గంభీర్ ని కోహ్లీ కలిసి కౌగిలించుకోకుండా.. కేవలం హ్యాండ్ షేక్ ఇవ్వడంతోనే సరిపెట్టాడు. అంతేకాకుండా గంభీర్ దగ్గరికి రాగానే ఫేస్ సీరియస్ గా పెట్టాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ముఖంలోని హావాభావాలను చూస్తే వీరిద్దరి మధ్య మళ్ళీ విభేదాలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

రంగంలోకి దిగిన బీసీసీఐ:

కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల మధ్యగత కొంతకాలంగా సంబంధాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతంలో ఐపీఎల్ సమయంలో వీరు బహిరంగంగానే గొడవ పడడం, డ్రెస్సింగ్ రూమ్ లో అంతర్గత ఘర్షణలు కొనసాగుతున్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Also Read: Virat Kohli: అదృష్టం బాగుంది.. లేకపోతే అర్షదీప్ సింగ్ సెంచరీ చేసేవాడు.. సెల్ఫీ వీడియోలో ఆడుకున్న కోహ్లీ

ఈ క్రమంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. జట్టులో మంచి వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఓ సయోధ్య సమావేశం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 2027 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల ప్రణాళికలు, అలాగే టీమ్ మేనేజ్మెంట్ ఆశలు, అంచనాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Bhushan Pohane (@bhushan_pohane)

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×