E-Paper
Advertisement

Virat Kohli: ద‌క్షిణాఫ్రికాపై తాండ‌వం… సింహాచలంలో ద‌ర్శ‌నం, కోహ్లీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరో !

Virat Kohli: ద‌క్షిణాఫ్రికాపై తాండ‌వం… సింహాచలంలో ద‌ర్శ‌నం, కోహ్లీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరో !
Advertisement

Virat Kohli: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ లో వన్డే సిరీస్ ని భారత జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించగా.. రెండవ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలుపొందింది. ఇక శనివారం విశాఖపట్నం వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణించి భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్ ని 2 – 1 తేడాతో కైవసం చేసుకుంది.

Also Read: Virat Kohli: అదృష్టం బాగుంది.. లేకపోతే అర్షదీప్ సింగ్ సెంచరీ చేసేవాడు.. సెల్ఫీ వీడియోలో ఆడుకున్న కోహ్లీ

Advertisement

 

“ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” గా విరాట్ కోహ్లీ:

ఈ టోర్నీలో అసాధారణ బ్యాటింగ్ ప్రతిభ కనబరిచిన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” గా నిలిచాడు. మొదటి రెండు వన్డేలలో సెంచరీలు, మూడవ వన్డేలో హాఫ్ సెంచరీతో.. ఈ సిరీస్ లో మొత్తంగా 302 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ సిరీస్ లో అత్యధిక సిక్సులు బాధింది కూడా విరాట్ కోహ్లీయే. మూడు మ్యాచ్ లలో వందకు పైగా స్ట్రైక్ రేటుతో ఏకంగా 12 సిక్సులు బాదాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లు ఉండగా.. విరాట్ కోహ్లీ ఖాతాలో 20 వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు చేరింది.

Advertisement

టి-20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇక మూడవ వన్డే అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” ఈ సిరీస్ లో నేను ఆడిన విధానం నాకు సంతృప్తిని ఇచ్చింది. రెండు, మూడేళ్లుగా నేను ఈ విధంగా ఆడలేదు. మిడిల్ ఓవర్లలో ఎలాంటి పరిస్థితినైనా జట్టుకు అనుకూలంగా మార్చగలనని తెలుసు. అది టీమ్ కి చాలా సహాయపడుతుంది. నేను ఇప్పటికీ జట్టుకు సహకారం అందించగలిగినందుకు సంతోషం. ఇక నేను స్వేచ్ఛగా ఆడినప్పుడు సిక్సర్లు కొట్టగలనని నాకు తెలుసు. ముఖ్యంగా రాంచీలో ఆడిన ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ తర్వాత ఏ మ్యాచ్ లోను నేను ఆడలేదు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లలో రాణించినందుకు సంతోషంగా ఉంది”. అని చెప్పుకొచ్చాడు.

 

సింహాచలం అప్పన్న సేవలో విరాట్ కోహ్లీ:

విరాట్ కోహ్లీకి మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు.. ఇతడికి భక్తి కొంచెం ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత కోహ్లీ తన భార్యతో కలిసి తరచూ గుళ్లకు వెళ్తూ కనిపించాడు. లండన్ లో కూడా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనే ఎక్కువగా కనిపించాడు. ఇక తాజాగా మరోసారి ఆధ్యాత్మిక చింతనలో తాను ముందుంటానని మరోసారి నిరూపించుకున్నాడు. విశాఖలో మూడవ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న మరుసటి రోజు కోహ్లీ.. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలాన్ని సందర్శించాడు.

Also Read: Gambhir vs Parth Jindal: పార్థ్ జిందల్ కు ఇచ్చిప‌డేసిన గంభీర్‌.. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఏంటీ?

అక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. విరాట్ కోహ్లీ రాకతో ఆలయ పరిసరాలలో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఆలయానికి పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో {పంచే, కుర్తా} ధరించి వచ్చిన కోహ్లీని చూసిన అభిమానులు, భక్తులు ఆశ్చర్యపోయారు. ఇక ఆలయ అధికారులు మరియు అర్చకులు రన్ మిషిన్ కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకుని, అర్చకుల చేత ప్రత్యేక పూజలు చేయించుకున్నాడు. కోహ్లీకి వేద పండితులు వేదశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×