Virender Sehwag on Abhishek Sharma: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్లు తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైట్ ఉంటుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ శర్మ తుది జట్టులో ఉండడం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ టోర్నమెంట్లో చాలా దారుణంగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ ( ABHISHEK SHARMA), ఫైనల్స్ లో ఆడడం కష్టమే అని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ పై వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతని ఓపెనర్ గా కాకుండా మూడో స్థానంలో బరిలోకి దింపాలని కోరారు.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఓపెనర్ గా విఫలమవుతున్న అభిషేక్ శర్మను మూడోస్థానం లేదా నాలుగో స్థానంలో బరిలోకి దింపాలని కోరారు. అప్పుడు అభిషేక్ శర్మ మంచి ఫామ్ లోకి వస్తాడని వెల్లడించారు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ సమయంలో తాను కూడా ఓపెనర్ గా చాలాసార్లు విఫలమయ్యానని గుర్తు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఆ సమయంలో తనను మూడు లేదా నాలుగో స్థానంలో దాదా బరిలోకి దింపేవాడని వెల్లడించారు.
ఇక మూడు లేదా నాలుగో స్థానంలో తాను బ్యాటింగ్ చేసి 30 నుంచి 40 పరుగులు సాధించే వాడినని పేర్కొన్నారు. అలా తను ఫామ్ లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఓపెనర్ గా బరిలోకి దింపేవాడని పేర్కొన్నారు. ఇప్పుడు అభిషేక్ శర్మ విషయంలో కూడా అదే ఫార్ములా పాటించాలని కోరారు. అలాంటప్పుడే అభిషేక్ శర్మ బాగా ఆడతాడని పేర్కొన్నారు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన అభిషేక్ శర్మ సిక్సర్లు అలాగే బౌండరీలు అద్భుతంగా కొడతాడు అన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ సక్సెస్ అయిన తర్వాత మళ్లీ ఓపెనర్ గా దించాలని కోరారు.
టీమ్ ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్ ), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ( విఎట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా మరియు అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ ప్రాబబుల్ XI: టిమ్ సీఫెర్ట్ (w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ ( కెప్టెన్ ), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్
🚨 MASSIVE STATEMENT BY VIRENDRA SEHWAG ON ABHISHEK SHARMA🚨
Virendra Sehwag said 🗣️
"You can make Abhishek Sharma play at number three. That can also be done because if your opening partnership… because it doesn't matter to Abhishek Sharma whether it's powerplay or… pic.twitter.com/Fc8rvZD8XT
— Cricket Central (@CricketCentrl) March 8, 2026