E-Paper
Advertisement

Israel: ఇజ్రాయెల్ ప్రజలకు స్నాన గండం.. ఆ వెబ్‌సైట్ చూశాకే బాత్‌రూమ్‌లోకి, ఎందుకంటే?

Israel: ఇజ్రాయెల్ ప్రజలకు స్నాన గండం.. ఆ వెబ్‌సైట్ చూశాకే బాత్‌రూమ్‌లోకి, ఎందుకంటే?
Advertisement

ఇజ్రాయెల్ ప్రజలు స్నానం చేయాలంటే భయపడిపోతున్నారు. డైలీ ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్‌లో టైమ్ చెక్ చేసుకుని మరీ స్నానానికి వెళ్తున్నారు. ఎందుకలా అని అనుకుంటున్నారా? ఇందుకు కారణం యుద్ధమే. ఔనండి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఏ మూల నుంచి క్షిపణులు దూసుకొచ్చి తమ మీద పడతాయా అనే భయాందోళనలతో ఇజ్రాయెల్ గడుపుతోంది. వారి శత్రుదేశమైన ఇరాన్.. క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలకు అప్పడుప్పుడు బ్రేక్ ఇచ్చినా.. ఇజ్రాయెల్‌కు మాత్రం ఒకటే మ్యూజిక్కు. ఆ బాంబుల నుంచి తప్పించుకోవాలంటే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో వారు టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఒక వెబ్ సైట్ సాయంతో సేఫ్ టైమ్‌లో స్నానాలు చేస్తున్నారు. అదెలాగంటే…

వెబ్ సైట్లలో వెతుకులాట..

ఇరాన్ నుంచి దూసుకొస్తున్న క్షిపణుల నుంచి తప్పించుకోవడం కోసం ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సైరన్ మోగగానే ప్రజలు వెంటనే షెల్టర్లకు చేరుకుని ప్రాణాలు కాపాడుకోవాలి. అయితే, ఆ సైరెన్లు ఎప్పుడు మోగుతాయో తెలియని పరిస్థితి. దీంతో చాలామంది ఇజ్రాయెల్ ప్రజలు ఓ వెబ్ సైట్ ద్వారా సురక్షితమైన సమయం కోసం సెర్చ్ చేస్తున్నారు. రియల్ టైమ్ రిస్క్ ఎసెస్‌మెంట్ అనే టూల్ ద్వారా వారు ఆ సమయానికి స్నానానికి వెళ్లొచ్చా లేదా అని తెలుసుకుంటున్నారు. అందులోని మీటర్ రిస్క్ తక్కువగా, గ్రీన్ మార్క్ చూపిస్తే.. వారు స్నానానికి వెళ్తారు. రెడ్ మార్క్ చూపిస్తూ 50 శాతం మిస్సైల్ దాడి జరగవచ్చనే హెచ్చరిక చూపిస్తే మాత్రం స్నానాలు వదిలి నిత్యవసరాలు, నీళ్లు సర్దుకుని షెల్టర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఎంత సేపు స్నానం చేస్తారనేదే ప్రశ్న..

Advertisement

మీరు స్నానానికి వెళ్తారు సరే? మరి బాత్రూమ్‌లో ఎంతసేపు గడుపుతారు? ఈ లోపు ఏదైనా క్షిపణి దూసుకొస్తే? అనే సందేహాలకు కూడా ఈ వెబ్ సైట్‌లో జవాబులు దొరుకుతున్నాయి. స్నానానికి వెళ్లడానికి సేఫ్ టైమ్ వెతికే సమయంలోనే.. అందులో ఎంత సేపు స్నానం చేస్తారనే విషయాన్ని వెల్లడించాలి. దాని బట్టే అది రిస్క్ ఏ స్థాయిలో ఉంటుందనేది కరెక్టుగా చెబుతుంది. రిస్క్ తక్కువగా చూపిస్తే ప్రశాంతంగా స్నానం చేసి బయటకు వచ్చి.. పనులు చేసుకోవచ్చు. రిస్క్ ఉందని తెలిస్తే మాత్రం ఆ రోజుకు స్నానం చేయకపోవడమే ఉత్తమం.

ఈ టూల్‌ను ఎవరు తయారు చేశారు?

ఈ టూల్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన మ్యాటన్ ఎల్హ్యానీ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీన్ని తయారు చేశాడు. ఇరాన్‌పై దాడులు మొదలైన తర్వాత ఇజ్రాయెల్‌లో గ్యాప్‌ లేకుండా సైరెన్లు మోగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవ్వుతున్నారు. ఇంట్లో సాధారణ పనుల్లో నిమగ్నమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవడం సులభమే. కానీ, స్నానం, మలమూత్రాలకు వెళ్లేప్పుడు సైరన్లు మోగితేనే సమస్య. ఆ సమయంలో వారు వెంటనే తప్పించుకోలేరు. అందుకే, ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మ్యాటన్ కూడా ఇదే ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. అందుకే, ఈ టూల్‌ను సిద్ధం చేశాడు. అయితే, దీన్ని నూరు శాతం నమ్మొద్దన్ని, కాస్త లక్‌ను కూడా నమ్ముకోండి అని చెబుతున్నాడు.

సెకన్ల వ్యవధిలో షెల్టర్లకు చేరుకోవాలి

Advertisement

సైరన్లు మోగిన కొన్ని సెకన్ల వ్యవధిలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలి. షెల్టర్లు దూరంగా ఉండేవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారికి కంటి మీద కునుకు కూడా ఉండదు. ఎందుకంటే సెరైన మోగిన కొన్ని నిమిషాల్లోనే క్షిపణి దాడి జరుగుతుంది. ఆ లోపు తప్పించుకోకపోతే ప్రాణాలు పోతాయి. అందుకే అక్కడి ప్రజలంతా ఈ వెబ్ సైట్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. మొత్తానికి యుద్ధవాతావరణంలో ఇజ్రాయెల్ ప్రజలు టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అదే లేకపోతే.. వారి పరిస్థితి ఎలా ఉండేదో.

Also Read: గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ను ఎదిరించేంత సీన్ లేదా? అమెరికా, ఇజ్రాయెల్ హ్యాండిస్తే?

Related News

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

Big Stories

Advertisement
×