Nita Ambani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే 30కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసుకుంది. ఐదు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోయింది. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కూడా దారుణంగా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. 103 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) చేతిలో ఓటమిపాలైంది. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యాకు అంబానీ కుటుంబం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీతా అంబానీ మాత్రం చాలా సీరియస్ అయినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టేడియంలో మహికా శర్మ ( Mahieka Sharma), హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) రొమాన్స్ గురించి మాట్లాడుతూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట నీతా అంబానీ. ఈ మేరకు న్యూస్ వైరల్ గా మారింది.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కేవలం రెండు విజయాలు నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్… ఏకంగా ఐదు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది ముంబై ఇండియన్స్. మరో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఒకవేళ ఓడిపోతే… తదుపరి స్టేజ్ వెళ్లడం కష్టమే. అదే ముంబై ఇండియన్స్ జట్టును లీడ్ చేసే కెప్టెన్ సరిగ్గా లేడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం హార్థిక్ పాండ్యాకు నీతా అంబానీ గట్టిగా క్లాస్ పీకారట. దాదాపు నాలుగు గంటల పాటు హార్దిక్ పాండ్యాను తన రూమ్ కు పిలిపించుకొని మరి సీరియస్ అయినట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆకాష్ అంబానీ కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా తన ప్రియురాలు మహికా శర్మతో స్టేడియంలో ఓవరాక్షన్ చేస్తే తాటతీస్తామని హెచ్చరించారట. అసభ్యకరమైన సైగలు చేస్తూ.. కనిపిస్తే కెప్టెన్సీ పీకి పారేస్తామని కూడా తెలిపారుట.
🚨MI Management Unhappy With Hardik Pandya's Leadership🚨
– Dressing room atmosphere is tense and questions are being raised internally about Hardik's tactical calls, player management, and overall leadership
– Akash Ambani looked visibly unhappy yesterday, left the stadium… pic.twitter.com/44lNzmGtXZ— Indian Cricket (@IPL2025Auction) April 24, 2026