Mike Hussey: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ {MS Dhoni} ధోని గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని మైదానంలో ఉంటే ఆ భరోసానే వేరు. ఫీల్డింగ్, బౌలింగ్ ప్రణాళికలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. దాదాపు రెండు దశాబ్దాలు క్రికెట్ లో అనుభవం ఉన్న మహేంద్రసింగ్ ధోని మాస్టర్ మైండ్ ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒత్తిడి సమయంలో జట్టును ప్రశాంతంగా ముందుకు నడిపించడం, వికెట్ల వెనకాల స్టంప్ అవుట్ లతో, బౌలింగ్ ప్రణాళికలతో మ్యాచ్ స్వరూపాన్ని మారుస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Also Read: IND VS SA 1st ODI: దక్షిణాఫ్రికా ప్లేయర్లను బండబూతులు తిట్టిన కోహ్లీ.. షాకింగ్ వీడియో ఇదిగో
ఆన్ ఫీల్డ్ లో ఎప్పుడూ కూల్ గా కనిపించే మహేంద్ర సింగ్ ధోని.. ఆఫ్ ఫీల్డ్ లో ఎలా ఉంటాడు..? చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఏం చేస్తారు..? అనే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, కోచ్ {Mike Hussey} మైక్ హస్సి. మైదానంలో ధోని {MS Dhoni} ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో.. ఆఫ్ ఫీల్డ్ లో కూడా అంతే ప్రశాంతంగా ఉంటాడని తెలిపాడు. “ప్రతి ఐపీఎల్ సీజన్ లో ధోని స్వరూపమే చెన్నై సూపర్ కింగ్స్ {CSK} కి ప్రధాన ఆకర్షణ. ధోని టీమ్ లాంజ్ లో అందరిలాగే సాధారణంగా ఉంటాడు. ప్లేయర్లతో 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఏ ఆటగాడు అయినా తమ సమస్య చెప్పుకుంటే వెంటనే మాట్లాడి పరిష్కరిస్తాడు. జట్టు సభ్యులపై ఎప్పుడు ఒత్తిడి పెంచడు. ఎల్లప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండే వ్యక్తి ధోని. ఇతని కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ ఓ కుటుంబంలా మారింది.
Also Read: Palash Muchhal: చేసిందంతా చేసి, ఇప్పుడు సింపతి కోసం పలాష్ కొత్త డ్రామాలు… సుద్దపూసలాగా మారీ!
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హుక్కా కొడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు {Mike Hussey} మైక్ హస్సి. “ధోని {MS Dhoni} ఒక్క నిర్ణయం తీసుకునేందుకు రాత్రంతా ఆలోచిస్తాడు. ఎవరిని తొందర పెట్టడు. అలాగే ఎవరిని తప్పు పట్టడు. ఇది ప్లేయర్లకు ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది. మ్యాచ్ ఓడినా, గెలిచినా.. ధోని రియాక్షన్ ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఈ జట్టు కుటుంబంలా అనిపిస్తుంది. ప్రతి ఐపీఎల్ సీజన్ లో ధోని రూమ్ అనధికారిక టీమ్ లాంజ్ లా మారింది. ప్లేయర్లు 24 గంటలు అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు ఆటగాళ్లు హుక్కాతో రిలాక్స్ కావడం జరిగేది. ఇటువంటి బాండింగ్ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ ఒక కుటుంబంలా మారింది. క్రికెట్ కన్నా సంబంధాలను ముఖ్యంగా భావించే అరుదైన కెప్టెన్లలో ధోని ఒకరు”. అని తెలిపాడు మైక్ హస్సి.