E-Paper
Advertisement

Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం

Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం
Advertisement

Delhi News: సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. తక్కువ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. డిసెంబర్ 8-9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాలని ఆహ్వానాలు అందజేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ముగిసిన హస్తిన పర్యటన

Advertisement

భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. దగ్గరుండి మంత్రులు-అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు.

అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్’కు రావాలంటూ ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్​ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రిలియన్​ డాలర్ల లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు.

Advertisement

ప్రధాని మోదీ, రాహల్, సోనియాగాంధీతో సీఎం భేటీ

అందుకు అనుగుణంగా అన్నిరంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను తెలిపారు. తెలంగాణ రైజింగ్​-2047 విజన్​ డాక్యుమెంట్​ రూపొందించినట్లు తెలియజేశారు. నీతి ఆయోగ్​ సలహాలు, అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన విజన్​ డాక్యుమెంట్‌ను గ్లోబల్​ సమ్మిట్​ లో ఆవిష్కరించనున్నట్లు ప్రధానికి వివరించారు ముఖ్యమంత్రి.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం తగిన సహాయ సహాకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్​ మెట్రో రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 162.5 కిలోమీటర్ల పొడవున విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందన్నారు.

ALSO READ: ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తున్నారు-ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి

రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్​ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్​ రీజనల్ రింగ్​ రోడ్డు ఉత్తర భాగం, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు, ఫైనాన్సియల్ అప్రూవల్​ ఇవ్వాలని కోరారు. రీజనల్​ రింగ్​ రోడ్డు ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్​ రింగ్​ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని తెలిపారు.

హైదరాబాద్​ నుంచి అమరావతి మీదుగా బందర్​ పోర్టు వరకు 12 లేన్​ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. హైదరాబాద్​ నుంచి బెంగుళూరు హై స్పీడ్​ కారిడార్, గ్రీన్​‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాలు చేపట్టేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దీనికితోడు హైదరాబాద్​ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరం రవాణా సదుపాయం ఉండేలా టైగర్​ రిజర్వ్ మీదుగా నాలుగు లేన్ల ఎలివేటేడ్​ కారిడార్​ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని ప్రధానికి వినతిపత్రం అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అంతకుముందు పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. డిసెంబర్ 8-9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కు హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రైజింగ్- 2047 విజన్​ డాక్యుమెంట్​ గురించి వివరించి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్‌, మనోహర్ లాల్ కట్టర్‌లతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే మరికొందరు కేంద్ర మంత్రులను కలిసి సదస్సుకు ఆహ్వానించారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×