E-Paper
Advertisement

AUS VS ZIM: కొంప ముంచిన‌ త‌ల పొగ‌రు సెల‌బ్రేష‌న్లు..పాతాళంలోకి ఆస్ట్రేలియా జ‌ట్టు

AUS VS ZIM: కొంప ముంచిన‌ త‌ల పొగ‌రు సెల‌బ్రేష‌న్లు..పాతాళంలోకి ఆస్ట్రేలియా జ‌ట్టు

AUS VS ZIM: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఆస్ట్రేలియాకు ఘోర అవమానం ఎదురయింది. పసికూన జింబాబ్వే జట్టు చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఒకప్పుడు వరల్డ్ కప్ లు అవలీలగా సాధించే ఆస్ట్రేలియా… ఓ అనామక జట్టుపై ఓడిపోవడం ఎప్పుడు విమర్శలకు తావు ఇస్తోంది. అయితే ఈ దరిద్రానికి కారణం ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ మిచెల్ మార్ష్ ( Mitchell Marsh Celebrations) అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు తల పొగరుగా వ్యవహరించారు. ఇందులో మార్ష్ అయితే మరీ ఓవర్ గా ప్రవర్తించాడు. వరల్డ్ కప్ టైటిల్ పైన కాలు పెట్టి ఫోటోలు దిగాడు. అప్పట్లో ఈ ఫోటో వివాదంగా మారింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా ఐసీసీ టోర్నమెంట్ లో పెద్దగా రాణించడం లేదు.

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

ఆస్ట్రేలియా తల పొగరు సెలబ్రేషన్స్ కొంపముంచాయా ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా జింబాబ్వే లాంటి చిన్న దేశం చేతిలో చిత్తుగా ఓడింది కంగారు జట్టు. నిన్న లీగ్ స్టేజ్ లో ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే ( Aus VS Zim) మధ్య ఫైట్ జరిగింది. జింబాబ్వే జట్టులో పెద్దగా ప్లేయర్లు ఎవరూ లేరు. అయినా కూడా లైట్ తీసుకుంది ఆస్ట్రేలియా. ఇదే అదునుగా చూసుకున్న జింబాబ్వే రెచ్చిపోయి ఆడి, 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా పరువు పోతోంది.

ట్రోఫీ పైన కాలు పెట్టిన మిచెల్ మార్ష్

ఇలాంటి నేపథ్యంలోనే గతంలో 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు తలపోగరు సెలబ్రేషన్స్ చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. దాని ఫలితంగా ఇప్పుడు ఆస్ట్రేలియా చిన్న జట్ల చేతులలో ఓడిపోతుందని అంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్ ట్రోఫీ గెలవలేక పోతోంది. వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్… ట్రోఫీ పైన కాలు పెట్టి విమర్శలకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తల పొగరు సెలబ్రేషన్స్ అనంతరం వైట్ బాల్ క్రికెట్ లో ఆస్ట్రేలియా అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. 2024 t20 ప్రపంచ కప్ సమయంలో ఆఫ్గనిస్తాన్ చేతిలో కూడా ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత సెమీస్ చేరలేదు.

ఇటు శ్రీలంక దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ఇండియా చేతిలో వన్డే సిరీస్ కూడా ఓడిపోయింది. గబ్బాలో విడిచి చేతి లో భంగపాటు ఎదుర్కొంది ఆస్ట్రేలియా. ఇక టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో జింబాబ్వే చేతిలో నిన్న చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియా. ఈ దెబ్బకు పాతాళంలోకి వచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. అందుకే ఇలా ఓవరాక్షన్ గా సెలబ్రేషన్స్ చేసుకోకూడదని అంటున్నారు ఫాన్స్.

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×