E-Paper
Advertisement

Mitchell Santner: మిచెల్ సాంట్నర్ కు డ‌బ్బులు ఎగ్గొట్టిన ముంబై ఇండియ‌న్స్ !

Mitchell Santner: మిచెల్ సాంట్నర్ కు డ‌బ్బులు ఎగ్గొట్టిన ముంబై ఇండియ‌న్స్ !

Mitchell Santner: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం (Mumbai Indians) తనను నట్టేట ముంచిందని, డబ్బులు ఎగ్గొట్టిందని తిరుగుబాటు చేశాడు న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ (Mitchell Santner). ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు మిచెల్ సాంట్నర్. ఈ క్రమంలో ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన జీతంలో ( IPL 2026 salary)… సగం మాత్రమే చెల్లించిందట ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఈ విషయాన్ని స్వయంగా మిచెల్ సాంట్నర్ బయట పెట్టి, ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కోసం ఆడితే… తనకు గాయమైందని, అలాంటప్పుడు జీతం ఎలా కట్ చేస్తారని నిలదీశారట. దీంతో మిచెల్ సాంట్నర్ జీతం వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

మిచెల్ సాంట్నర్ కు డ‌బ్బులు ఎగ్గొట్టిన ముంబై ఇండియ‌న్స్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో మిచెల్ సాంట్నర్ ను రెండు కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఇక మొన్న 2026 సందర్భంగా అతన్ని రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో ఈసారి కూడా ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు మిచెల్ సాంట్నర్. ఒప్పందం ప్రకారం రెండు కోట్లు ఇవ్వకుండా, తనకు కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని ది గ్రేట్ క్రికెటర్ పాడ్ కాస్ట్ లో తన బాధను వెళ్లగెక్కాడు మిచెల్ సాంట్నర్. ఐపీఎల్ ప్రారంభమైన సందర్భంగా విమానం దిగిన వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడినట్టు గుర్తు చేశారు. అదే సమయంలో తన కుడి భుజానికి గాయమైందని గుర్తు చేశారు. ఆ తర్వాత కోల్పోయిన మళ్లీ బరిలోకి దిగానని… రెండు వారాల వ్యవధిలో ఎడమ భుజానికి కూడా గాయమైందని ( (Mitchell Santner) Injury) స్పష్టం చేశారు. తన శరీరాన్ని పణంగా పెట్టి ముంబై ఇండియన్స్ కోసం ఆడినట్లు ఎమోషనల్ అయ్యారు. కాని చివరికి తనకు సగం జీతం మాత్రమే ఇచ్చారని ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు మిచెల్ సాంట్నర్ . దీంతో ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

అసలు IPL రూల్స్ ఏం చెబుతున్నాయి ?

ఐపీఎల్ రూల్స్ ప్రకారం… ఒక ప్లేయర్ జట్టులో చేరిన తర్వాత గాయపడితే… కచ్చితంగా ఫుల్ శాలరీ ఇవ్వాల్సిందేనని తెలుస్తోంది. కానీ మిచెల్ సాంట్నర్ విషయంలో అలా జరగలేదు. గాయంతో మిచెల్ సాంట్నర్ దూరమైన నేపథ్యంలో సాలరీ కట్ చేశారట. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు మిచెల్ సాంట్నర్ మాత్రమే బయటపెట్టారు. ముంబై ఇండియన్స్ ఎక్కడ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. వాళ్లు నిజంగానే డబ్బులు సగమే ఇచ్చారా? లేక ఫుల్ జీతం ఇచ్చారా ? అనేది తెలియాల్సి ఉంది. కేవలం మిచెల్ సాంట్నర్ వెర్షన్ మాత్రమే బయటకు వచ్చిన నేపథ్యంలో ఇది నిజమని చెప్పలేమని కొంతమంది అంటున్నారు. దీనిపై నిజంగానే ముంబై ఇండియన్స్ స్పందించి క్లారిటీ ఇస్తే.. వివాదం సద్దుమణుగుతుందని చెబుతున్నారు.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

Tanveer Ahmed: ఆఫ్ఘనిస్తాన్ బౌల‌ర్ల‌కు కోహ్లీ భ‌య‌ప‌డుతున్నాడు..అందుకే గాయం పేరు నాట‌కాలు!

గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో బెన్ స్టోక్స్‌..భ‌యంక‌ర‌మైన వ్యాధి సోకిందంటూ ప్రచారం

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Big Stories

×