Afg vs Pak: అప్ఘనిస్తాన్ క్రికెట్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కు ఝలక్ ఇస్తూ, సిరీస్ రద్దు చేసుకుంది అప్ఘనిస్తాన్. పాకిస్తాన్ తో త్వరలో జరిగే టి20 ట్రై సిరీస్ ను రద్దు చేసుకుంది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. నవంబర్ మాసంలో పాకిస్తాన్, శ్రీలంక అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య టి20 ట్రై సిరీస్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో ముగ్గురు క్రికెటర్లను అన్యాయంగా పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. తాజాగా పాకిస్తాన్ బాంబు దాడి నేపథ్యంలో ఏకంగా ముగ్గురు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో వెంటనే రియాక్ట్ అయింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ తో త్వరలో జరిగే ట్రై సిరీస్ రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కాబూల్ లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పైన మరో వైమానిక దాడి చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో 8 మంది మరణించారు. మరో ఏడు మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు కూడా మరణించారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. దీంతో త్వరలో జరగబోయే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ట్రై సిరీస్ లో పాకిస్తాన్, శ్రీలంక అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. రెండు దేశాల మధ్య వార్ కొనసాగిన నేపథ్యంలో సిరీస్ నుంచి తప్పుకుంది.
పాకిస్తాన్, శ్రీలంక అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నవంబర్లో ట్రై సిరీస్ జరగాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫైనలైంది. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు పాకిస్తాన్ వేదికగా ఈ ట్రై సిరీస్ జరగనుంది. టి20 ఫార్మేట్ లో ఈ మ్యాచ్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ తో గొడవల నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుదేలైంది. అంతేకాదు ఈ ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటికి వెళ్లడంతో… సిరీస్ నిర్వహణపై అనేక సందేహాలు నెలకొన్నాయి. పూర్తిగా ఈ ట్రై సిరీస్ రద్దు అవుతుందా? లేదా ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో మరో జట్టును తీసుకువస్తారా ? అనేది చూడాలి. అలా కుదరకపోతే శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య టి20 సిరీస్ జరిగే ఛాన్స్ లు ఉంటాయి. అటు శ్రీలంక కూడా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే దాదాపు 100 కోట్ల వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
🚨 AFGHANISTAN PULLS OUT OF TRI SERIES Vs PAKISTAN 🚨
– Afghanistan Cricket withdrawn from next month's T20I Tri series against Pakistan. (ESPNcricinfo). pic.twitter.com/MRb3kEuNC6
— Tanuj (@ImTanujSingh) October 18, 2025