Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 19 మ్యాచ్ లు ఈ టోర్నమెంట్ లో పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇలాంటి నేపథ్యంలో రెండు జట్లకు తలో పాయింట్ అందించింది ఐసీసీ. ఈ దెబ్బకు పాయింట్లు పట్టికలో నెంబర్ 2 స్థానంలో ఉన్న సౌతాఫ్రికా సెమీస్ క్వాలిఫై అయింది. అదే సమయంలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఇవాల్టి మ్యాచ్ లో న్యూజిలాండ్ కనుక గెలిస్తే, టీమిండియా సెమీస్ ఆశలు దాదాపు గల్లంతు అయ్యేవి. కానీ వర్షం కారణంగా ఇండియాకు లాభం చేకూరింది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో సెమీస్ కు దూసుకు వెళ్ళింది దక్షిణాఫ్రికా. ఇప్పటికే ఆస్ట్రేలియా మహిళల జట్టు 9 పాయింట్లతో మొదట సెమీస్ కు వెళ్ళింది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. పాయింట్ల ప్రకారం నేరుగా సెమీస్ కు దక్షిణాఫ్రికా దూసుకువెళ్లింది. ఇక మరో రెండు జట్లు సెమీస్ కోసం తలపడుతున్నాయి. ఇంగ్లాండ్, టీమిండియా, న్యూజిలాండ్ జట్లకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే కచ్చితంగా మూడు మ్యాచ్ లు వరుసగా గెలవాల్సిందే. టీమిండియా తన తర్వాతి మ్యాచ్ లలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో తలపడనుంది. రేపు ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉంది. ఈ మూడు మ్యాచ్ లలో కూడా టీమిండియా గెలిస్తే ఎలాంటి డౌట్ లేకుండా సెమీ ఫైనల్ కు వెళుతుంది. అయితే ఈ మూడు మ్యాచ్ లలో ఒక్కటి ఓడి, రెండు గెలిచినా కూడా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా వెళ్లాలంటే, న్యూజిలాండ్ వరుసగా అన్ని మ్యాచ్ లు ఓడిపోవాలి. అదే జరిగితే రన్ రేట్ ప్రకారం టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు వెళుతుంది. అటు సెమీ ఫైనల్ కు ఇంగ్లాండ్ కూడా వెళ్తుంది. ఇది ఇలా ఉండగా, ఇక ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీని వల్ల పాకిస్థాన్ కు ఒక్కో పాయింట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
Play Suspended Due To Rain in Colombo. Pakistan are at 52/3 after 12.2 overs against New Zealand. Tough conditions for the players, but safety first! Looking forward to the match resuming! ⛈️🏏#NZWvPAKW #ICCWomensWorldCup #Cricket #RainStopsPlay #Colombo2025 #InsideFieldSports pic.twitter.com/xBrXP53GBB
— IF SPORTS (@IFSPORT_) October 18, 2025