Mohammed Shami Warns Gambhir: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకి (Mohammed Shami) అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దేశవాళితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో (IPL) అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా సెలెక్టర్స్ పట్టించుకోవడం లేదు. పదే పదే అతడిని రిజెక్ట్ చేస్తున్నారు. త్వరలో జరగబోయే టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ) సిరీస్ కోసం వన్డే జట్టును ప్రకటించారు. అందులో కూడా అతనికి అవకాశం రాలేదు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ గంభీర్ అలాగే టీమిండియా సెలెక్టర్ల పై మండి పడుతూ షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.
తన కంటే తోపు బౌలర్ మరొకరు ఉంటే వెంటనే చూపించండి… లేకపోతే తననైనా సెలెక్ట్ చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ తనకంటే మెరుగైన బౌలర్ సెలెక్ట్ చేసిన జట్టులో ఉండి ఉంటే, తాను వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని గంభీర్ కు సవాల్ విసిరారు. అలా చూపించకపోతే తనను సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తాను టీమ్ ఇండియా సెలెక్టర్లపై తిరుగుబాటు చేయడం లేదని… తనలో ఉన్న టాలెంట్ గుర్తించాలని పదే పదే కోరుతున్నట్టు వ్యాఖ్యానించారు. దీంతో మహమ్మద్ షమీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి
టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాల తాను ప్రయత్నిస్తున్నానని మహమ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా కష్టపడుతున్నానని తెలిపారు. మంచి రిథమ్ తో బౌలింగ్ చేస్తున్నానని.. వికెట్లు ఎక్కువ సంఖ్యలో పడగొట్టే శక్తి తనలో ఉందని వివరించారు. దేశవాళీ మ్యాచ్ లు ఆడడంపై ప్రత్యేక దృష్టిసారించి… తన ఆటతీరును మెరుగుపరుచుకున్నానని తెలిపారు. పది ఓవర్లు బౌలింగ్ చేసి ఎక్కువ వికెట్లు తీసే కెపాసిటీ దక్కించుకున్నానని వ్యాఖ్యానించారు. ఇలాంటి టాలెంటు ప్రస్తుత టీమిండియాలో ఎవరికి లేదని తెలిపారు. అలాంటి వాళ్లు టీమ్ ఇండియాలో ఉండుంటే తనకు చూపించాలని సవాల్ విసిరారు.
తనకంటే గొప్ప మొగలిరే ఉండి ఉంటే.. వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని గంభీర్ కు సవాల్ విసిరారు. తాను క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తున్నానని… గతంలో కంటే మెరుగైన బౌలర్ గా మారినట్టు మహమ్మద్ షమీ వ్యాఖ్యానించారు. తనకు తాను డబ్బా కొట్టుకోవడం కాదని…ఒకసారి అవకాశం ఇస్తే తానేంటో ప్రూఫ్ చేసుకుంటానని వెల్లడించారు. 36 సంవత్సరాలు ఉన్న తాను మంచి ఫిట్నెస్ తో బౌలింగ్ చేయడం తన అదృష్టం అన్నారు. కానీ సెలక్టర్లు మాత్రం పట్టించుకోకపోవడం అవమానకరంగా ఉందని ఎమోషనల్ అయ్యారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో బరిలోకి దిగాలని ఎంతో ఆశగా ఉందని తెలిపారు. దీంతో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.