Nindu Noorella Saavasam Serial Today Episode: వైజయంతి చెప్పడంతో అమర్ వెళ్లి మిస్సమ్మను నిజం చెప్పమని అడుగుతాడు. రాథోడ్ చేత ఎందుకు బెదిరింపు కాల్ చేయించావు అని అడుగుతాడు. అందుకు మిస్సమ్మ బాధపడుతూ పార్థుక అక్కడ కూడా ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంతో అలా చెప్పించానని.. అలాగైతే మీరు ఢిల్లీ వెళ్తారని ఆలోచించాను కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని మిస్సమ్మ చెప్పగానే.. అమర్ మరింత కోపంగా అబద్దం చెప్పకు భాగీ నిజం ఏంటో చెప్పు నిజం చెప్పేంతవరకు అసలు నాతో మాట్లాడకు అంటూ అమర్ కోపంగా వెళ్లిపోతాడు. మిస్సమ్మ సార్‌కు నిజం చెప్పే సమయం వచ్చిందేమో చెప్పు మిస్సమ్మ సార్‌కు నిజం చెప్పి ఆ మనోహరికి బుద్ది వచ్చేలా చేయ్ అంటాడు. మిస్సమ్మ మౌనంగా చూస్తుంటుంది.
ఆశ్రమానికి వెళ్లిన మనోహరిని పిలిచి వార్డెన్ ఆశ్రమంలోని ఆఫీసు రూం క్లీన్ చేసి ఫైల్స్ నీట్‌గా సర్దమని చెప్తుంది. అందుకు మనోహరి కోపంగా చూస్తుంటే.. రాజు వెళ్లి ఏం అమ్మ చేయవా..? అని అడిగితే ఎందుకు చేయను చేయక చస్తానా అని మనోహరి మనసులో అనుకుని ఆఫీసు రూం క్లీన్ చేస్తుంది. రూం క్లీన్ చేయడం ఆయిపోయాక సరస్వతి, రాజు వచ్చి వర్షాలు పడక ఆశ్రమంలోని మొక్కలు వాడిపోతున్నాయని వాటికి కాస్త నీళ్లు పట్టమని చెప్తారు. మనోహరి ఇష్టం లేకున్నా భయంతో బాధగా వెళ్లి మొక్కలకు నీళ్లు పడుతుంది.
మనోహరి నీళ్లు పడుతుండగానే.. యాదమ్మ వస్తుంది. మనోహరి పని చేస్తుండటం చూసి షాక్ అవుతుంది. అయ్యో మనోహరి నీకు ఎంత కష్టం వచ్చింది అంటూ బాధపడినట్టు నటిస్తుంది. మనోహరి కోపంగా మాటలు ఆపి ఎందుకు వచ్చావో చెప్పు అంటే.. ఫోన్‌లో నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు చెప్పావు కదా అందుకే చూసి వెళ్దామని వచ్చాను అంటూ అసలు చెమట చుక్కే తెలియని నీకు కన్నీటి చుక్క చూపిస్తున్నారు వీళ్లు అంటూ తిడుతుంది. సోది ఆపి ఈ నాటకం ఆడిస్తున్నది భాగీయే కదా అంటుంది మనోహరి. అవును మనోహరి నువ్వు ఎక్కడకి పారిపోకుండా ఆ సిస్టర్స్‌ను పంపించింది భాగీయేనట రాథోడ్‌తో చెప్తుంటే విన్నాను అంటుంది. అది నాటకం ఆడుతుందని ముందే తెలిస్తే అసలు ఇక్కడకు వచ్చేదాన్ని కాదు.. ఇక్కడ ఈ పనులు చేయలేకపోతున్నాను చంభా అంటూ మనోహరి బాధపడుతుంటే..
ఇక్కడ పనులు చేయకుండా ఎక్కడకు వెళ్తావు మనోహరి అక్కడికి వస్తే అక్కడ వైజయంతి మేడం ఉంటుంది. ఆవిడ ఢిల్లీ వెళ్లిపోయేంత వరకు కాస్త ఓపికతో ఇక్కడే ఉండు.. అంటూ యాదమ్మ చెప్పగానే.. అంత వరకు ఈ సరస్వతి వార్డెన్ నన్ను బతకనిస్తుందా..? అంటూ తిడుతుంటే.. రాజు, వార్డెన్ దగ్గరకు వెళ్తారు. త్వరగా మొక్కలకు నీళ్లు పట్టి పిల్లల బట్టలు ఉతకమని చెప్తారు. అందుకు మనోహరి షాక్ అవుతుంది. బట్టలా అని అడిగితే.. నీకు ఉతకడం రాకపోతే యాదమ్మ సాయం తీసుకో అంటుంది వార్డెన్. ఆ మాటలకు యాదమ్మ షాక్ అవుతుంది. నాకు వేరే పనుంది మేడం నేను వెళ్తాను అంటూ తప్పించుకుని వెళ్లబోతుంటే మనోహరి కోపంగా తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.