BigTV English

Mohammed Shami’s Friend opens up: ఆరోజు షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు: ఫ్రెండ్ చెప్పిన మాట

Mohammed Shami’s Friend opens up: ఆరోజు షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు: ఫ్రెండ్ చెప్పిన మాట

Mohammed Shami’s Friend opens up: 33 ఏళ్ల టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి భార్య పెట్టిన మెంటల్ టార్చర్ సామాన్యమైనది కాదు. ఈ క్రమంలో ఒకసారి ఫ్రెండ్ అపార్ట్ మెంట్ కి వెళ్లాడు. అది 19వ ఫ్లోర్ లో ఉంది. ఆ రోజు ఏం జరిగిందో షమీ ఫ్రెండ్ ఉమేశ్ కుమార్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపాడు. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ గా మారింది.


ఇంతకీ విషయం ఏమిటంటే షమీ జీవితంలో భార్య కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడని ఫ్రెండ్ ఉమేశ్ తెలిపాడు. ముఖ్యంగా గృహ హింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. ముఖ్యంగా దేశ ద్రోహం చేశాడనే నింద రావడంతో తట్టుకోలేక పోయాడు. ఆరోజు మా అపార్ట్ మెంటులోనే 19వ ఫ్లోర్ లో ఉన్నాడు. తన మాటల వల్ల మాకర్థమైంది ఏమిటంటే, తను జీవించడానికి ఇష్టపడటం లేదని అనిపించింది. ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నాడేమో అనుకున్నాం.

అందుకే తనని గమనిస్తూ కూర్చున్నాం. అనుకోకుండా నిద్రపట్టేసింది. తెల్లవారుజామున నాలుగుగంటలకు లేచి చూస్తే పక్కన షమీ లేడు. హడలిపోయాం. వెంటనే పరుగెత్తి బాల్కనీ దగ్గర చూస్తే, అక్కడ తచ్చాడుతున్నాడు. నెమ్మదిగా వెళ్లి సముదాయించి తీసుకొచ్చామని అన్నాడు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకి ఫిక్సింగ్ ఆరోపణలు అవాస్తవమని తేలింది. క్లీన్ చిట్ వచ్చింది. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు.


Also Read: అభిషేక్ నాయర్‌తో పాండ్యా వివాదం

తర్వాత భార్యతో వివాదాలని పరిష్కరించే పనిలో పడ్డాడు. అయితే ఆమె మాత్రం ఇప్పటికి తనని మానసికంగా వేధిస్తూనే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్ లో తనకి పేరు రావడం చూసి తట్టుకోలేక, యూట్యూబ్ ల్లో రకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చి మానసికంగా వేధించింది. ఇప్పుడు చూడండి..ఉలుకు లేదు, పలుకు లేదని ఉమేశ్ తెలిపాడు.

క్లీన్ చిట్ వచ్చిన దగ్గర నుంచి మహ్మద్ షమీలో పాజిటివ్ ద్రక్పథం వచ్చింది. జీవితంలో ఎన్ని సమస్యలున్నా పోరాడుతూనే ఉండాలని అనుకున్నాడు. ఇప్పటికి పోరాడుతున్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుని, ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. త్వరలోనే భారత జట్టుకి మళ్లీ ఆడతాడని తెలిపాడు. సెప్టెంబరులో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కి అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ఇకపోతే 2027 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడి కప్ తీసుకురావడం షమీ జీవితాశయమని ఉమేశ్ పేర్కొన్నాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×