BigTV English

Viral Video: మరోసారి ఢిల్లీ మెట్రోలో రచ్చ.. యువతి మామూలుగా రెచ్చిపోలేదు

Viral Video: మరోసారి ఢిల్లీ మెట్రోలో రచ్చ.. యువతి మామూలుగా రెచ్చిపోలేదు

Viral Video: మెట్రో పేరు వినగానే మొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీ మెట్రోనే. కొంత కాలంగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి ఏదో ఒక వీడియో తరచూ వైరల్ అవుతూనే ఉంటుంది. మెట్రోలో అసభ్యకరంగా ప్రవర్తించడం, రొమాన్స్ చేయడం, గొడవలు, కొట్లాటలు, యువతులు రీల్స్ చేయడం, ఇలా ఏదో ఒక విధమైన ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి వీడియోలు తరచూ ఢిల్లీ మెట్రోలో వెలుగుచూడడం వల్ల సోషల్ మీడియా నుంచి తోటి ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల కారణంగా మెట్రో యాజమాన్యం కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయినా కూడా మెట్రోలో మాత్రం విన్యాసాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.


అశ్లీల డ్యాన్స్ చేస్తూ దానిని వీడియో కూడా తీసుకుంటూ కనిపించింది. ఇదంతా తోటి ప్రయాణికులకు అభ్యంతకరంగా అనిపిస్తుందని కూడా ఆలోచించకుండా యువతి చెలరేగింపోయింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో యువతి చేసిన పని చిక్కుల్లోకి నెట్టేసింది. భోజ్ పురి పాటపై ఓ యువతి ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేస్తూ దర్శనమిచ్చింది. మహిళా కోచ్ లో జనాలు ఎక్కువగా లేని సమయం చూసి అమ్మాయి వీడియోలు చేసింది. ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తూ నడుమును చూపిస్తూ రెచ్చిపోయింది. వీడియోలో చివరికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన స్టాప్ రాగానే బ్యాగ్ వేసుకుని మెట్రో దిగింది. ఇదంతా తోటి వారు వీడియో తీశారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోకి నెటిజన్లు మండిపడుతూ కామెంట్స్ చేశారు. నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కి ముంబై పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ అమ్మాయి మనీశా అని ఇది వరకు ముంబైలోను రైలులో ఇలాగే వీడియోలు చేసిందని గుర్తించారు. దీంతో ఈ అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని కోరగా ఆ అమ్మాయి క్షమాపణ చెప్పింది. అయితే తాజాగా మరోసారి ఇలాంటి తీరునే ప్రదర్శించడంతో అందరూ మండిపడుతున్నారు.


 

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×