BigTV English

Hardik Pandya Vs Abhishek Nayar: అభిషేక్ నాయర్‌తో పాండ్యా వివాదం

Hardik Pandya Vs Abhishek Nayar: అభిషేక్ నాయర్‌తో పాండ్యా వివాదం

Hardik Pandya argues with abhishek Nayar: శ్రీలంకలో భారతజట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమైంది. అప్పుడే కొత్త కోచింగ్ టీమ్ కి, ఆటగాళ్లకి మధ్య అండర్ స్టాండింగ్స్ దెబ్బతిన్నాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో మంగళవారం తొలి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది.


అయితే బ్యాటింగ్ కోచ్ గా ఉన్న అభిషేక్ నాయర్ వర్సెస్ హార్దిక్ పాండ్యా మధ్య వివాదం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా గౌతం గంభీర్ అయితే సంజూ శాంసన్ కి బ్యాటింగ్ టెక్నిక్కులు నేర్పించాడు. తనెక్కడ తప్పులు చేస్తున్నాడో తెలిపాడు. టీమ్ ఇండియా ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. అందులో ఈ విషయం స్పష్టంగా కనిపించింది.

ఈ వీడియోలో తెలియని ఘటన మరొకటి జరిగిందని నెట్టింట వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే తను కొట్టిన బంతి బౌండరీకి వెళ్లిందని పాండ్యా అన్నాడు. అయితే బ్యాటింగ్ కోచ్ గా ఉన్న అభిషేక్ నాయర్ మాత్రం దాంతో ఏకీభవించలేదు. అది ఫోర్ కాదని తెలిపాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం నడిచిందని అంటున్నారు. ఫీల్డర్ మధ్యలోంచి ప్లేస్ మెంట్ చూసి కొట్టడాన్ని పాండ్యా ప్రాక్టీస్ చేశాడని అంటున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య డిస్కషన్ జరిగిందని చెబుతున్నారు.


Also Read: గంభీర్ ఆధ్వర్యంలో శ్రీలంకలో ప్రాక్టీస్ షురూ

ఇకపోతే ఇంతవరకు రాహుల్ ద్రవిడ్-రోహిత్ శర్మ అనుసరించిన దూకుడు మంత్రాన్నే అనుసరించమని గంభీర్ చెప్పినట్టు తెలిసింది. అయితే క్రీజువదిలి వచ్చి షాట్లు కొట్టవద్దని, 20 ఓవర్లే కాబట్టి ఎక్కువ బాల్స్ వేస్ట్ చేయవద్దని చెప్పినట్టు తెలిసింది. ప్రతీ బాల్ ని కొట్టమనికాదు, ఓవర్ రన్ రేట్ చూసుకుని ఆడమని చెప్పినట్టు తెలిసింది. ఈ దూకుడు మంత్రం చూసి వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ కలవరపడుతున్నట్టు సమాచారం.

ఎందుకంటే తను క్రీజులో నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడు. అప్పుడు ఎటాకింగ్ మోడ్ లోకి వెళతాడు. కానీ గంభీర్ వాలకం చూస్తుంటే మొదటి బాల్ నుంచి దంచి కొట్టమనడం చూస్తుంటే, ఈ ప్రయత్నంలో ఇబ్బందులు పడడు కదా.. అనే అనుమానాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×