E-Paper
Advertisement

Vishwak Sen: తేడా వస్తే ఎక్కేటోళ్లు కూడా రావచ్చు.. ‘కల్ట్’ టీజర్‌ చూసేందుకు వినూత్న ఆహ్వానం

Vishwak Sen: తేడా వస్తే ఎక్కేటోళ్లు కూడా రావచ్చు.. ‘కల్ట్’ టీజర్‌ చూసేందుకు వినూత్న ఆహ్వానం
Advertisement

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫంకీ’ (Funky) చిత్రం, విడుదలైన మొదటి ఆట నుంచే ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవాలను పక్కన పెట్టి, ఇప్పుడు మాస్ కా దాస్ తన సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 100 మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్న మూడో చిత్రం ‘కల్ట్’ (Cult). ఈ సినిమాతో దర్శకుడిగా మరోసారి తానేంటో నిరూపించుకునేందుకు విశ్వక్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ లాంచ్ వేడుకకు అందరికీ ఆహ్వానం పలికారు మాస్ కా దాస్. ఆ ఆహ్వానం ఎంత వినూత్నంగా ఉందంటే.. తేడా వస్తే ఎక్కేటోళ్లు కూడా ఈ టీజర్ స్క్రీనింగ్‌కు రావాలని ఆయన ఆహ్వానం పలికారు. విశ్వక్ తన ప్రకటనలో..

Also Read- Rashmika Vijay Marriage: రష్మిక మమ్మల్ని పెళ్లికి పిలవదు.. ఈ మాట అందెవరో తెలుసా?

తేడాలొస్తే ఎక్కేటోళ్లు కూడా రావచ్చు

Advertisement

‘‘హలో గైస్ నమస్తే.. ఈ శనివారం నాకు చాలా ముఖ్యమైన రోజు. నేను డైరెక్ట్ చేసిన మూడో చిత్రం ‘కల్ట్’ టీజర్‌ విడుదల కాబోతోంది. ఐమాక్స్‌లో శనివారం సాయంత్రం 3 గంటలకు స్క్రీనింగ్ చేయబోతున్నాం. అందుకే మిమ్మల్నందరినీ కోరుతున్నది ఏమిటంటే.. అంతా ఈ టీజర్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడాలని. ఇది మెచ్యూర్డ్ ఆడియెన్స్ కోసమే. ఒక డైరెక్టర్‌గా చెబుతున్నా.. ఇది ఇండియాస్ ఫస్ట్ స్లాషర్. వీడు ఫస్ట్ స్లాషర్ అని అంత ప్రౌడ్‌గా ఎందుకు వేసుకున్నాడు? అని.. తేడాలొస్తే ఎక్కేటోళ్లు కూడా ఈ వేడుకకు రావచ్చు. వీటన్నింటికీ బిగ్ స్క్రీన్ సాక్ష్యం కాబోతోంది. కల్ట్ యాక్టర్స్ అందరినీ మరోసారి స్పెషల్‌‌గా వేడుకుంటున్నాను. ఈ సినిమాతో దాదాపు 100 మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. నేను కూడా ఈ కల్ట్ ఫ్యామిలీలో ఒకడిని. మీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని రండి.. థియేటర్‌లో కలుసుకుందాం’’ అని విశ్వక్ సేన్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

Also Read- Puri jagannadh: పూరి పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్… పూరి రియాక్షన్ ఇదే!

‘మ్యాడ్’ తరహాలో ముగ్గురి యువకుల కథ

Advertisement

ఇంతకు ముందు అంటే అప్పుడెప్పుడో విశ్వక్ ఈ ‘కల్ట్’ గురించి చెబుతూ.. రియల్‌గా జరిగిన ఓ సంఘటనను బేస్ చేసుకుని ఈ కథ రాశాను.లైఫ్‌లో ఓడిపోయిన ముగ్గురు యువకులు ఏం చేశారనేదే ఈ కథ. చాలా మంచి పాయింట్. ఈ కథ అనుకుని, రాస్తున్నప్పుడు.. ఇదొక ‘కల్ట్’ సినిమా కావాలని అంతా అనుకున్నాం. అలా ఈ సినిమాకు ‘కల్ట్’ అనే టైటిల్ పెట్టేశాం. ఇందులో నూతన నటీనటులకు అవకాశం ఇస్తున్నాను. ‘మ్యాడ్’ తరహాలో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కచ్చితంగా ఈ సినిమాతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారని అన్నారు. అదన్నమాట మ్యాటర్.

Also Read- Simran Choudhary: బీచ్ సైడ్ అందాలతో హీట్ పుట్టిస్తున్న సిమ్రాన్ చౌదరి!

Related News

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

Big Stories

Advertisement
×