E-Paper
Advertisement

Mohsin Naqvi: బంగ్లాదేశ్ ఆడ‌క‌పోతే, పాకిస్తాన్‌ కూడా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి త‌ప్పుకుంటుంది

Mohsin Naqvi: బంగ్లాదేశ్ ఆడ‌క‌పోతే, పాకిస్తాన్‌ కూడా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి త‌ప్పుకుంటుంది
Advertisement

Mohsin Naqvi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ ఆడడంపై తీవ్ర సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాలు చూపించి ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో కాకుండా శ్రీలంకలో తమ టి20 మ్యాచ్ లు నిర్వహించాలని కోరుతోంది బంగ్లాదేశ్. దీనికి ఐసీసీ మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. మీరు చెప్పినట్టు వినేది లేదని మొండి పట్టు పట్టింది ఐసీసీ. బంగ్లాదేశ్ ప్లేయర్లకు మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. అయినా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ దిగి రావడం లేదు.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

పాకిస్తాన్ కొత్త డ్రామాలు.. బీసీసీఐకి షాక్ తప్పదా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ వైదొలిగే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త స్కెచ్ వేసింది. టి20 ప్రపంచ కప్ 2026 నుంచి మేము కూడా తప్పుకుంటామని తాజాగా మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారట. PCB అధ్యక్షుడుగా కొనసాగుతున్న మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi )… ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారట. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం ఎవరు ప్రిపేర్ కాకూడదని.. నేను చెప్పిన తర్వాత ప్రిపేర్ కావాలని ఆదేశాలు ఇచ్చాడట. బంగ్లాదేశ్ డిమాండ్లు ఐసిసి నెరవేర్చితేనే… పాకిస్తాన్ కూడా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడుతుందని స్పష్టం చేశాడట మొహ్సిన్ నఖ్వీ. బంగ్లాదేశ్ ఆడితేనే, మేం ఆడ‌తామ‌ని తేల్చిచెప్పాడ‌ట‌. బీసీసీఐ ని ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐసీసీ సంచలన ప్రకటన… బంగ్లాదేశ్ కు కొత్త ఝలక్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ పదే పదే చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో భద్రతా కారణాలు చూపించి, వేదికలు మార్చాలని డిమాండ్ చేస్తోంది బంగ్లాదేశ్. ఇండియాలో కాకుండా అంగారకుడి పైన కూడా ఆడతామని స్పష్టం చేస్తోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు మార్పులు చేయాలని ఐసీసీని ఇప్పటికే కోరింది బంగ్లాదేశ్. అయితే, బంగ్లాదేశ్ డిమాండ్లను పక్కకు పెట్టింది ఐసీసీ. మేం ముందుగా ఫిక్స్ చేసిన వేదికలోనే బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడాలని వెల్లడించింది. వేదికలు మార్చడానికి ఇది సమయం కాదు.. సందర్భం కాదని క్లారిటీ ఇచ్చిందట. ఆడితే ఆడండి? లేదా టోర్నమెంట్ నుంచి వైదొలగండి ? ఈ అంశంపై ఈనెల 21వ తేదీ వరకు ఆన్సర్ మాత్రం చెప్పండి అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు డెడ్ లైన్ ఫిక్స్ చేసిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఆడకపోతే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ లాంటి దేశాన్ని తీసుకువస్తామని చెప్పిందట.

Advertisement

 

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×