E-Paper
Advertisement

Adventure Bikes India: రాయల్ ఎన్ఫీల్డ్ To హీరో.. ఇండియాలో బెస్ట్ అండ్వెంచర్ బైక్స్ ఇవే!

Adventure Bikes India: రాయల్ ఎన్ఫీల్డ్ To హీరో..  ఇండియాలో బెస్ట్ అండ్వెంచర్ బైక్స్ ఇవే!
Advertisement

ఇండియన్ మార్కెట్లోకి అదిరిపోయే అడ్వెంచర్ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో రాయల్ ఎన్‌ ఫీల్డ్ హిమాలయన్ 450, హీరో ఎక్స్‌ పల్స్ 200 4V,  హీరో ఎక్స్‌ పల్స్ 210 లాంటి ప్రసిద్ధ అడ్వెంచర్ బైక్‌లు ఉన్నాయి. హిమాలయన్ 450..  బడ్జెట్ ఫ్రెండ్లీ హీరో ఎక్స్‌ పల్స్ మోడల్స్ తో పోలిస్తే మరింత శక్తివంతమైనది కావడంతో పాటు ప్రీమియం సెలెక్షన్ గా చెప్పుకోవచ్చు.  చిన్న, పెప్పర్ ఇంజిన్లతో అంటే 200cc, 210cc పవర్ ను కలిగి ఉన్నాయి. ఎక్స్ పల్స్ 200 4V మంచి వ్యాల్యూను కలిగి ఉంటుంది. కొత్త ఎక్స్ పల్స్ 210 ఎక్కువ పవర్ తో పాటు సౌకర్యంగా ఉంటుంది. బడ్జెట్ కు అనుగుణంగా  వీటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

⦿ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450

ఇది పూర్తి స్థాయి అడ్వెంచర్ టూరిర్ గా మార్కెట్లోకి అడుగు పెట్టింది.  452cc, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 39.47 bhp వపర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 3.06 లక్షల నుం చి ప్రారంభమవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఈ బైక్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. సీరియస్ ఆఫ్ రోడింగ్, లాంగ్ రేంజ్ రైడ్స్ కు పవర్ ఫుల్ ఇంజిన్ తో అనుకూలంగా ఉంటుంది.

⦿ హీరో ఎక్స్‌ పల్స్ 200 4వి

Advertisement

ఇది తేలికైన, యాక్సెస్ చేసే అడ్వెంచర్ బైక్. దీని ఇంజిన్ 199cc, 4-వాల్వ్,  18.9 bhp పవర్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్  ఎంట్రీ లెవల్ ధర రూ. 1.40 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బడ్జెట్ కాస్త తక్కువ, చురుకైన ట్రైల్ రైడింగ్,  ఫస్ట్ ADV కావాలనుకునే రైడర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ హీరో ఎక్స్‌ పల్స్ 210

ఇది అప్‌గ్రేడ్ చేసిన ఎక్స్ పల్స్. మంచి పవర్, అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇంజిన్ 210cc సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లిక్విడ్ కూల్డ్, 24.2 bhp, 200 4V కంటే ఎక్కువ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  ఎక్స్ పల్స్ లైన్ కోసం మిడిల్ రేంజ్ బైక్ గా ఇది రూపొందింది. దీని ధర రూ. 1.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 200 4V కంటే మెరుగైన పనితీరు, మెరుగైన హైవే సామర్థ్యం, ​​ఎక్కువ దూరం ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుంది.

ఈ బైక్స్ మధ్య కీలక తేడాలు

Advertisement

ఈ మూడు బైక్స్ కు సంబంధించి ఇంజిన్,  పవర్ ను పరిశీలిస్తే.. హిమాలయన్ 450 పెద్ద ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఎక్కువ పవర్ అవుట్‌ పుట్‌ తో మిగతా బైక్స్ తో పోల్చితే ముందుంటుంది. ధర విషయానికి వస్తే, హిమాలయన్ 450  టాప్ వేరియంట్ గా ఉంది. ఎక్స్ పల్స్  మోడల్స్ మంచి వ్యాల్యూను కలిగి ఉంటాయి.  ఫైనల్ గా హిమాలయన్ ఒక రగ్డ్ టూరర్ కాగా, ఎక్స్ పల్స్ చురుకైన ట్రైల్ విన్నర్స్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఎలక్ట్రిక్ వెహికిల్ లో వెళ్తున్నారా? బ్యాటరీ అయిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×