Mohsin Naqvi : పాకిస్తాన్ క్రికెట్ జట్టు ( Pakistan Team) డౌన్ ఫాల్ అవుతోన్న నేపథ్యంలో మొహ్పిన్ నఖ్వీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ పదవికి మొహ్పిన్ నఖ్వీ రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఓ మంత్రిగా అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు వహిస్తున్న మొహ్పిన్ నఖ్వీకి క్రికెట్ పైన అవగాహన లేదని కూడా మాజీలు విమర్శిస్తున్నారు. క్రికెట్ బ్యాట్ పట్టరాని మొహ్పిన్ నఖ్వీ చైర్మన్ కావడం ఏంటని షాహిద్ అఫ్రిది కూడా నిలదీస్తున్నారు. అయితే ఈ వివాదం పైన తాజాగా మొహ్పిన్ నఖ్వీ స్వయంగా స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసిరా.. ఎంత గింజుకున్నా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా తానే కొనసాగుతానని సంచలన ప్రకటన చేశారు. తనను దించేయాలని చాలామంది కుట్రలు చేస్తున్నారని.. కానీ వాళ్లు తనని ఏం పీకలేరు అంటూ స్పష్టం చేశారు.
వరుసగా పాకిస్తాన్ జట్టు టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోతున్న క్రమంలో మొహ్పిన్ నఖ్వీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అతడిని పదవి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో స్వయంగా మొహ్పిన్ నఖ్వీ… ఈ అంశంపై స్పందించారు. కొంత మంది తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని భావన వచ్చేలా మొహ్పిన్ నఖ్వీ ఫైర్ అయ్యారు. కొంతమందికి పాకిస్తాన్ క్రికెట్ బాగుపడటం ఇష్టం లేదని.. వాళ్లకు తనపై సమస్య ఉందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.. ఆయన ముఖ్యంగా తనను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లను ఉద్దేశించి.. వాళ్లు పాకిస్తాన్ కోసం ఏదీ సాధించకుండా తనపై విమర్శలు చేస్తున్నారని కోణంలో కౌంటర్ ఇచ్చి.. ఈ వివాదం నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితిని రాత్రికి రాత్రి మార్చడానికి తన వద్ద మాయా దండం లేదని మరోసారి మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. జట్టు ప్రదర్శనల వెనుక ఉన్న లోపాలను సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ జట్టు కుదురుకుంటోందని వ్యాఖ్యానించారు. తాను రాకముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు అట్టడుగు స్థాయిలో ఉండేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ గెలుపే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని వెల్లడించారు. తాను ఎప్పుడూ విమర్శలకు భయపడనని.. ఇకపై భయపడ బోనని స్పష్టం చేశారు. తాను వచ్చినప్పటి నుంచి క్రికెట్ నాశనం అయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు.. కానీ తాను రాకముందు ఐసీసీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలని మండిపడ్డారు.