MS Dhoni: టీమిండియా ప్లేయర్లకు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) అదిరిపోయే ధావత్ ఇచ్చాడు. రాంచీకి ( Ranchi ) వచ్చిన టీమిండియా ప్లేయర్లకు ప్రత్యేక ఆహ్వానం పలికాడు. రాంచీలో ఉన్న తన ఫామ్ హౌస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్ లాంటి పలువురు టీమిండియా క్రికెటర్లకు డిన్నర్ పార్టీ ఇచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. సాక్షి ధోని ఆధ్వర్యంలో ప్రత్యేక వంటలు కూడా చేశారట. ముఖ్యంగా జార్ఖండ్ స్టైల్ లో డిన్నర్ ఏర్పాటు చేశాడట ధోని. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.
దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa, 1st ODI ) మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి వన్డే మ్యాచ్ జార్ఖండ్ లోని రాంచీ ( JSCA International Stadium Complex, Ranchi ) వేదికగా జరగనుంది. ఈ రాంచి, మహేంద్రసింగ్ ధోని సొంత గ్రామం. ఇక్కడే మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) పుట్టి పెరిగాడు. రాంచీలో మహేంద్రసింగ్ ధోనీకి ఫామ్ హౌస్ కూడా ఉంది. అయితే మొదటి వన్డే ఆడేందుకు రాంచికి టీం ఇండియా ప్లేయర్లు వచ్చారన్న వార్త తెలియగానే, తన తోటి క్రికెటర్లకు డిన్నర్ పార్టీ ఇచ్చాడు ధోని. ముందుగా టీమిండియా క్రికెటర్లు ఉన్న హోటల్ కు వెళ్లి ఆహ్వానం పలికాడు.
సాధారణ పౌరుడిలాగా బైక్ పైన వెళ్లిన ధోని, టీమిండియా ప్లేయర్లకు ఆహ్వానం అందించాడు. ఇక ధోని ఆహ్వానం మేరకు ఆయన ఫామ్ హౌస్ కు ( Ms Dhoni Farm House) టీమిండియా క్రికెటర్లందరూ వచ్చారు. ఈ సందర్భంగా ధోని ఇచ్చిన డిన్నర్ పార్టీని ( Ms Dhoni Dinner Party) చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇందులో కొంతమంది మద్యం కూడా సేవించినట్లు టాక్. ధోని దగ్గర మిలటరీ వైన్ బాటిల్స్ ఉన్నాయట. వాటిని ఫుల్ గా కోహ్లీ అలాగే పంత్ లాంటి వాళ్లు తాగినట్లు తెలుస్తోంది. ఇక డిన్నర్ పార్టీ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీని ( Virat Kohli ) తన కారులోనే కూర్చోబెట్టుకొని హోటల్ దగ్గర డ్రాప్ చేశాడు MS ధోని. అటు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ ప్రత్యేక కారులో వెళ్లారు. దీంతో ధోని ఫామ్ హౌస్ లో టీమిండియా క్రికెటర్లు చేసిన సందడి సోషల్ మీడియాను షేర్ చేస్తోంది.
Rohit Sharma has arrived for dinner party at MS Dhoni's House, Ranchi.🐐 pic.twitter.com/oMaLEKfNH8
— `S.🚀 (@ThodaSaSanskari) November 27, 2025
MS Dhoni personally drove his car to drop Virat Kohli back at the hotel after dinner.🥺❤️ pic.twitter.com/sEHdZT1EGt
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 27, 2025