E-Paper
Advertisement

CTET Online Apply: సీటెట్-2026 అప్లికేషన్లు ప్రారంభం.. దరఖాస్తులు విధానం ఇలా

CTET Online Apply: సీటెట్-2026 అప్లికేషన్లు ప్రారంభం.. దరఖాస్తులు విధానం ఇలా
Advertisement

CTET Online Apply: ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హతకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(C-TET) నిర్వహిస్తుంది. సీటెట్ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహిస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధనకు సీటెట్ అర్హత తప్పనిసరి. సీటెట్​ ను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే సీటెట్ కు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 18 వరకు కొనసాగనుంది. 2026 ఫిబ్రవరి 8న పరీక్ష నిర్వహించనున్నారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇవాళ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫిబ్రవరి-2026 సెషన్‌ను యాక్టివేట్ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగనున్నాయి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు చెల్లింపును డిసెంబర్ 18 రాత్రి 11.59 గంటలలోపు పూర్తి చేయాలి.

పరీక్ష తేదీ, ఫీజు:

  1. ఫిబ్రవరి 8, 2026 సీటెట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 2.30 గంటలు వ్యవధి కేటాయించారు.
  2. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 వరకు: పేపర్ 2
  3. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 వరకు: పేపర్ 1
  4. పేపర్ 1లో 150 మార్కులకు 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి, బోధన, గణితం, పర్యావరణం, లాంగ్వేజ్ లను కవర్ చేస్తుంది. పేపర్ లో గణితం, సాంఘిక సాంఘిక శాస్త్రం ఉంటాయి.
  5. జనరల్, ఇతర వెనుకబడిన తరగతుల వారు సింగిల్ పేపర్‌కు రూ. 1000, డబుల్‌కు రూ. 1200 ఫీజు చెల్లించాలి. SC/ST, PWD, సింగిల్‌ పేపర్ కు రూ. 500, డబుల్‌కు రూ. 600 చెల్లించాలి.

అర్హతలు

Advertisement

సీటెట్ కు హాజరు అయ్యేందుకు అభ్యర్థులు తమ అర్హతను NCTE వెబ్‌సైట్ https://ncte.gov.inలో నిర్ధరించుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • సీటెట్ అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in) ని సందర్శించండి.
  • “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ లో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. పలు సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
  • ఆన్‌లైన్ లో ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Also Read: OICL: ఓఐసీఎల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేది ఎప్పుడంటే?

ముఖ్యమైన తేదీలు:

  1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 27, 2025
  2. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 18, 2025.
  3. ఫీజు చెల్లింపు చివరి తేది: డిసెంబర్ 18, 2025.
  4. సీటెట్ ఓఎమ్మార్‌ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 08, 2026.
Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×