E-Paper
Advertisement

WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే
Advertisement

WPL 2026 auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ {WPL} 2026 మెగా వేలం నవంబర్ 27 {నేడు} న్యూఢిల్లీలో జరిగింది. ఈ మెగా వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైంది. ఈ వేళలో మొత్తం 6 జట్లు.. 277 మంది ఆటగాళ్ల కోసం బిడ్ వేశాయి. ఈ 277 మంది ఆటగాళ్లలో 194 మంది దేశీయ, 66 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 5 జట్లు గతంలో తమ 16 మంది ఆటగాళ్ళను నిలుపుకున్నాయి. ఇక దేశీయ క్రీడాకారిణులలో 52 మంది క్యాప్డ్ {జాతీయ జట్టుకు ఆడిన} ప్లేయర్స్ కాగా.. 142 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్. మెగా యాక్షన్ కావడంతో స్టార్ ఆటగాళ్లపై భారీ హైప్ నెలకొంది.

Also Read: Palash – Smriti: స్మృతి పెళ్లిపై మరో ట్విస్ట్… పలాష్ ముచ్చల్ తో ఎఫైర్ పై మేరీ డి’కోస్టా సంచలన పోస్టు!

Advertisement

 

దీప్తి శర్మకు భారీ ధర:

ఈ మెగా యాక్షన్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర లభించింది. దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా.. ఆర్టీఎమ్ కార్డు ఉపయోగించి యూపీ వారియర్స్ ఏకంగా రూ. 3.20 కోట్లతో ఈమెని జట్టులోకి తీసుకుంది. గతంలో కూడా దీప్తి శర్మ ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఈ ఏడాది జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ {WPL} లో యూపీ వారియర్స్ జట్టుకు దీప్తి శర్మ కెప్టెన్ గా వ్యవహరించింది. అయితే మెగా వేళానికి ముందు ఈ జట్టు దీప్తిని రిటైన్ చేసుకోలేదు.

Advertisement

మరోవైపు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.10 కోట్లకు దక్కించుకుంది. అలాగే న్యూజిలాండ్ ఆల్రౌండర్, గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన సోఫీ డివైన్ ని గుజరాత్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక తెలుగు ప్లేయర్ శ్రీ చరణి ని ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ కడప బౌలర్ కి రూ. 1.3 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇటీవల వన్డే ప్రపంచ కప్ లో శ్రీచరిణి అద్భుతంగా రానించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రానా ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది.

న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలీయ కెర్ ని ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఇక ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో మెరుపు సెంచరీ చేసిన మెగ్ లానింగ్ ని యూపీ వారియర్స్ రూ. 1.9 కోట్లకు దక్కించుకుంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు ఢిల్లీ జట్టును ఫైనల్ కు తీసుకు వెళ్లిన ఈమెను ఢిల్లీ రిలీజ్ చేయగా.. యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లే స్టోన్ ని కూడా యూపీ వారియర్స్ దక్కించుకోవడం విశేషం. అలాగే యూపీ వారియర్స్.. ఆస్ట్రేలియా ఓపెనర్ లీచ్ ఫీల్డ్ ని కూడా దక్కించుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియాపై సెంచరీ కొట్టిన సోఫీ ని యూపీ వారియర్స్ రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Also Read: South Africa Coach statement: మా దెబ్బకు మోకాళ్లపై పడి, టీమిండియా ప్లేయర్లు ఏడవాల్సిందే

 

అలీసా హీలీకి షాక్:

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ అన్ సోల్డ్ అయ్యింది. గతంలో ఆరుసార్లు జట్టుకు టి-20 ప్రపంచ కప్ ని అందించిన కెప్టెన్ గా హీలికి రికార్డ్ ఉంది. కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఈమె కనీస ధర 50 లక్షలు అయినప్పటికీ.. ఈమెని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడం గమనార్హం.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×